ప్రధాని.. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు: సీపీఐ నారాయణ

విధాత: ప్రధాని ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేసి విశాఖ వస్తున్నారు. తెలంగాణ విభజన హామీలను ప్రధాని నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వాలపై ఈడీ దాడులే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమున్నది? బెంగాల్‌, కేరళ, తమిళనాడులో గవర్నర్‌లే పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్‌ వ్యవస్థతో కేంద్రం.. […]

  • Publish Date - November 10, 2022 / 08:44 AM IST

విధాత: ప్రధాని ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేసి విశాఖ వస్తున్నారు. తెలంగాణ విభజన హామీలను ప్రధాని నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వాలపై ఈడీ దాడులే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నర్‌ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమున్నది? బెంగాల్‌, కేరళ, తమిళనాడులో గవర్నర్‌లే పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్‌ వ్యవస్థతో కేంద్రం.. రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నదని పేర్కొన్నారు