PM Modi | తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది: ప్ర‌ధాని మోడీ

PM Modi దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఉంది వ్యాగన్ ఫ్యాక్టరీ నేషనల్ హైవే పనులకు శంకుస్థాపన టెక్స్టైల్ పార్క్ ప్రారంభం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన పీఎం ముందుగా భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్న ఆయన దాదాపు 6వేల కోట్ల విలువైన రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ నేషనల్ […]

PM Modi | తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది: ప్ర‌ధాని మోడీ

PM Modi

  • దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఉంది
  • వ్యాగన్ ఫ్యాక్టరీ నేషనల్ హైవే పనులకు శంకుస్థాపన టెక్స్టైల్ పార్క్ ప్రారంభం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన పీఎం ముందుగా భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్న ఆయన దాదాపు 6వేల కోట్ల విలువైన రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ నేషనల్ హైవే లకు శంకుస్థాపన చేశారు టెక్స్టైల్ పార్కును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు అంటూ తెలుగులో మోడీ ప్రసంగం ప్రారంభించారు.

దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం

మోదీ తెలంగాణ ఏర్పడి 9ఏళ్లు పూర్తయిందన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారతీయ ఎదిగింది అన్నారు ఇప్పుడు గోల్డెన్ పిరియడ్ నడుస్తోందని ఈ అవకాశాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సబ్కా వికాస్ కేంద్రం లక్ష్యమని ప్రకటించారు.

దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని ప్రధాని చెప్పారు. మోదీ ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని చెప్పారు. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నామన్నారు. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఈ మధ్య కనెక్టివిటీ పెంచడం ద్వారా అన్ని రంగాలలో పురోగతి సాధిస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని, కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.

రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తదితరులు ప్రసంగించారు.