బడ్జెట్‌ ధరలో నయా మొబైల్‌ను లాంచ్‌ చేసిన పోకో..! ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్‌ ఎప్పటి నుంచి అంటే..?

చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీదారు పోకో సరికొత్త మోడల్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది

బడ్జెట్‌ ధరలో నయా మొబైల్‌ను లాంచ్‌ చేసిన పోకో..! ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్‌ ఎప్పటి నుంచి అంటే..?

POCO C65 Mobile | చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీదారు పోకో సరికొత్త మోడల్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న పోటీని మరింత పెంచుతూ పోకో సీ-65 మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్స్‌ను పరిశీలిస్తే.. పోకో కొత్త మోడల్‌లో వాటర్​డ్రాప్​ నాచ్​ డిజైన్​, సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​ సెటప్‌ ఉంది. 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.74 ఇంచ్​ హెచ్​డీ ప్లస్‌ ఎల్​సీడీ ప్యానెల్‌తో వస్తుంది. 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన డ్యూయెల్​ రియర్‌ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్‌ ఉంటుంది. మీడియాటెక్​ హీలియో జీ85 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉండగా.. 1టీబీ ఎక్స్​ప్యాండెబుల్​ మైక్రోఎస్​డీ స్టోరేజ్​ ఆప్షన్​ సైతం ఉన్నది.


ఆండ్రాయిడ్​ 13 ఆధారిత ఎంఐయూఐ 14 సాఫ్ట్​వేర్​పై పని చేయనుండగా.. 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ, 18వాట్​ వయర్డ్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఉంటుంది. ఇంకా 4జీ వోల్ట్​ఈ, డ్యూయెల్​ బ్యాండ్​ వైఫై, బ్లూటూత్​ 5.3, జీపీఎస్​, టైప్​ సీ పోర్ట్​ కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి. ధర విషయానికి వస్తే పోకో సీ65 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్ వేరియంట్​​ ధర రూ.8,499గా ఉన్నది. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ రూ.9,499 కాగా. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ రూ.10,999గా నిర్ణయించింది. ఇందులో మాట్​ బ్లాక్​, పాస్టెల్​ బ్లూ కలర్స్​లో అందుబాటులో ఉన్నాయి. మొబైల్‌ సేల్స్‌ ఈ నెల 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మొదలవనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్రికెట్‌, డెబిట్‌ కార్డులపై రూ.1000 వరకు డిస్కౌంట్‌ సైతం లభిస్తున్నది.