పార్టీతో ఆర్థికంగా లాభపడ్డ పొంగులేటి: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

విధాత: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ జెండా లేదు.. అజెండా లేదని బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎద్దేవా చేశారు. పొంగులేటి ఆత్మీయ సమ్మేళనంపై మండిపడ్డారు. ఖమ్మం బీఆర్‌ఎస్‌ నేతలను అసెంబ్లీకి వెళ్లనివ్వనన్నపొంగులేటి వ్యాఖ్యలపైఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొత్తు కాదని, ఖమ్మం బీఆర్‌ఎస్‌ నేతలు బరాబర్‌ అసెంబ్లీలో అడుగుపెడతారని వద్దిరాజు అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నారు. పార్టీతో పొంగులేటి ఆర్థికంగా […]

  • Publish Date - April 11, 2023 / 04:05 AM IST

విధాత: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ జెండా లేదు.. అజెండా లేదని బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎద్దేవా చేశారు. పొంగులేటి ఆత్మీయ సమ్మేళనంపై మండిపడ్డారు.

ఖమ్మం బీఆర్‌ఎస్‌ నేతలను అసెంబ్లీకి వెళ్లనివ్వనన్నపొంగులేటి వ్యాఖ్యలపైఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొత్తు కాదని, ఖమ్మం బీఆర్‌ఎస్‌ నేతలు బరాబర్‌ అసెంబ్లీలో అడుగుపెడతారని వద్దిరాజు అన్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నారు. పార్టీతో పొంగులేటి ఆర్థికంగా లాభ పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ వాళ్లను ఓడించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.