ఏమి క్రియేటివిటీ రా బాబు.. ప్రభాస్,అనుష్కకి పెళ్లి.. పాపను కూడా పుట్టించేశారుగా..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ప్రభాస్ అని చెప్పాలి. ఆయన వయస్సు 40 ఏళ్లు అయిన ఇప్పటికీ పెళ్లి జోలికి పోవడం లేదు. అభిమానులు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని పదే పదే అడుగుతున్నా కూడా ప్రభాస్ మాత్రం దానిని పక్కన పెట్టేస్తున్నాడు.
తన పెళ్లి కోసం ఏ మాత్రం ఆరాటపడడం లేదు. కెరీర్‌పైనే దృష్టి పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి గురించి అనేక ప్రచారాలు సాగుతున్నాయి. పలానా హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి అని లేదంటే, భీమవరం అమ్మాయిని చేసుకోబోతున్నాడని ప్రచారాలు చేశారు. అనుష్క శెట్టి, కృతి సనన్ తో ప్రేమ అంటూ కూడా నెట్టింట అనేక వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా ప్రభాస్,అనుష్కల పెళ్లి గురించి ఎక్కువగా ప్రచారాలు వచ్చాయి. వారి పెళ్లి చేసుకున్నారని, ఫారెన్ లో ఇల్లు కూడా కొనుకున్నారంటూ ఇటీవల పలు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటిలో నిజం లేదని.. ప్రభాస్ తో పాటు ఆ ఇద్దరు కూడా వివరణ ఇచ్చారు.
అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తెగ ఆశపడుతున్నారు. అది ఎలాగు కుదరకపోవడంతో వారే ప్రత్యేకంగా పోస్టర్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. అవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఈ సారి ఫ్యాన్స్ కాస్త ముందు అడుగు వేసి ప్రభాస్,అనుష్కకి పిల్లలని కూడా పుట్టించారు.
గతంలో ప్రభాస్ అనుష్క పెళ్లి వరకే పరిమితం అయిన అభిమానులు.. ఈసారి మాత్రం అనుష్క, ప్రభాస్ తో పాటు ఓ బేబీ ఫోటో కూడా యాడ్ చేసి ఫ్యామిలీ ఫొటోని బయటకు వదిలారు. ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు చేస్తున్న సమయంలో ప్రభాస్, అనుష్కలకి పెళ్లి చేసి ఒక పాప కూడా పుట్టించి ఫొటో వదిలారు.
#Pranushka పేరుతో హ్యాష్ ట్యాగ్ తో ఫొటో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన వారందరు చాలా అందంగా ఉందని, ఇలా అయినా వీరిద్దరు కలిస్తే బాగుండు అని అభిమానులు స్పందిస్తున్నారు. మరి ఈ పిక్‌పై ప్రభాస్, అనుష్క ఏమైన స్పందిస్తారా అనేది చూడాలి. ఇక ప్రభాస్ రానున్న రోజులలో సలార్, కల్కి చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనున్నాడు.