MLA Kokkirala Prem Sagar Rao: కేబినెట్ విస్తరణపై మీనాక్షితో ప్రేమ్ సాగర్ రావు భేటీ!

MLA Kokkirala Prem Sagar Rao: కేబినెట్ విస్తరణపై మీనాక్షితో ప్రేమ్ సాగర్ రావు భేటీ!

MLA Kokkirala Prem Sagar Rao:  తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశంపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ప్రేమ్ సాగర్ రావు మీడియాతో మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానానికి నేను చెప్పాల్సింది చెప్పానని..10 నిమిషాలు మీనాక్షి నటరాజన్ తో చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పానన్నారు. నన్ను 12 గంటలకు రమ్మంటే 10 నిమిషాలు ముందుగానే వచ్చానని తెలిపారు. నేను ఎవరి వద్ద లొంగి మాట్లాడను ..సీఎం దగ్గర కూడా చెప్పాల్సిన అంశాలు చెప్పి వెళ్ళిపోతాను అని స్పష్టం చేశారు. నాకు మీడియాలో కనపడాలి అనే తాపత్రయం లేదన్నారు.

మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి తనకు స్థానం కల్పించాలంటూ ప్రేమ్ సాగర్ రావు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై తుది కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఆసక్తకరంగా మారింది.