Dil Raju | రాజకీయాల్లోకి రమ్మంటున్నారు.. పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు..
Dil Raju | విధాత: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ ఎంపీ (Nizamabad MP) స్థానానికి ఆయన పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బలగం సినిమా (Balagam Cinema) సక్సెస్‌పై నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు (Dil Raju) తన […]

Dil Raju |
విధాత: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ ఎంపీ (Nizamabad MP) స్థానానికి ఆయన పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బలగం సినిమా (Balagam Cinema) సక్సెస్‌పై నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు (Dil Raju) తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించారు.
రాజకీయాల్లోకి రావాలని చాలా మంది నాయకులు ఆహ్వానిస్తున్నారు. కానీ రాజకీయాల్లోకి వెళ్లాలా..? వద్దా..? అనే దానిపై తనకు స్పష్టత లేదన్నారు. సినిమా రంగంలోనే తనపై విమర్శలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. చాలా మంది రాళ్లు వేస్తున్నారు. కామెంట్స్ చేసే వాళ్లు చేస్తుంటారు. కానీ రాజకీయాల్లోకి వెళ్లాలంటే అన్ని రకాలుగా ప్రిపేరయి వెళ్లాలి. అది నా వల్ల కాకపోవచ్చు అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.
ఇటీవల విడుదలైన బలగం సినిమా బాగా ప్రజాదరణ పొందిందని దిల్ రాజు పేర్కొన్నారు. అయితే గ్రామాల్లో బలగం సినిమా ప్రదర్శనను అడ్డుకుంటున్నామని ప్రచారం సాగుతోంది. తమకు అలాంటి ఉద్దేశాలు లేవన్నారు. ప్రేక్షకులు ఏ రకంగా సినిమా చూసినా సంతోషమే.
బలగం సినిమాను చూసి కుటుంబాలు కలుస్తున్నాయంటే తమకెంతో సంతోషంగా ఉంది. ఇంకా గ్రామాల్లో ఎవరైనా బలగం చూడాలనుకుంటే తమను సంప్రదిస్తే తామే సినిమా చూసే ఏర్పాట్లు చేస్తామని దిల్ రాజు ప్రకటించారు.
నిజానికి ఇలా బహిరంగ ప్రదర్శనల వల్ల ఓటీటీ సంస్థతో న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయన్నారు. వాటిని తాము మాట్లాడి పరిష్కరించుకుంటామని దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.