Pune | హిజ్రాలు డబ్బులు డిమాండ్ చేస్తే కేసు- పూణే కమిషనర్
విధాత: ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాన్స్ జెండర్లు గుమిగూడడం, నగరంలోని ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడంపై పూణే పోలీసులు నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచి మే 11 వరకు ఇది అమలులో ఉండనుంది. నెల రోజుల పాటు అమల్లో ఉండే ఉత్తర్వుల్లో దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. వివాహం, నిశ్చితార్థం లేదా ఇతర మతపరమైన కార్యకలాపాలు, కుటుంబంలో జననం, మరణం వంటి సందర్భాల్లో ట్రాన్స్ జెండర్లు సమూహంగా ఏర్పడి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు సీపీ తెలిపారు.
ఫిర్యాదులు అందడంతోనే సిఆర్పిసి సెక్షన్ 144 కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే సెక్షన్ 188, 143, 144, 147, 159, 268, 384 కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గతేడాది నాగ్పూర్ సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో అమితేష్ కుమార్ ఇదే తరహాలో ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 144 కింద జిల్లా మేజిస్ట్రేట్లు, అధికారుల శాంతిభద్రతలకు హాని కలిగించే సందర్భాలలో నిషేధాజ్ఞలను జారీ చేయడానికి ఇది వీలు కల్పిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram