Pushpa The Rule: ఇంకా షూటింగ్ అవ్వలే.. RRR రికార్డు కనుమరుగు చేసిన పుష్ప2
విధాత, సినిమా: టాలీవుడ్‌లోకి సినీ బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా.. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ని అందుకుని ఆ తర్వాత ‘పుష్ప’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో పుష్ప మూవీ రెండో భాగానికి భారీ డీల్ జరుగుతున్నట్టు తెలిసింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన చిత్రమే ‘పుష్ప’. ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల భారీ స్పందనను […]

విధాత, సినిమా: టాలీవుడ్‌లోకి సినీ బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా.. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ని అందుకుని ఆ తర్వాత ‘పుష్ప’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ నేపథ్యంలో పుష్ప మూవీ రెండో భాగానికి భారీ డీల్ జరుగుతున్నట్టు తెలిసింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన చిత్రమే ‘పుష్ప’. ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల భారీ స్పందనను రాబట్టుకుంది. మరి ముఖ్యంగా హిందీలో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
పుష్ప మేనియాతో ఇండియా మొత్తం ఊగిపోయింది. పుష్ప అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 144.90 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ 146 కోట్లుగా నమోదవగా.. సినిమా ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకి 35 కోట్ల లాభాలు వచ్చాయి. నిజంగా ఇది ఊహించని విజయం. ఎందుకంటే సినిమా విడుదల రోజు భారీగా నెగిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సక్సెస్‌ఫుల్ కాంబోలో ఇప్పుడు ‘పుష్ప’ రెండో భాగం తెరకెక్కుతోంది. ఇందులో మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే ఇప్పుడు రెండో భాగానికి ‘పుష్ప ది రూల్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో ‘పుష్ప’ రూలర్‌గా ఎలా మారాడు? అన్న విషయాన్ని హైలెట్ చేసి చూపించబోతున్నట్టు ఇప్పటికే తెలిసింది.
అల్లు అర్జున్‌కు పుష్ప మూవీతో క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగును మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అలాగే త్వరలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తుంది.
అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే భారీ బిజినెస్ జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఒక్క టీజర్, పోస్టర్, ట్రైలర్, పాట ఏదీ విడుదల కాలేదు. అయినా ఈ చిత్రంపై బజ్ కారణంగా దీని హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా అప్పుడే ఈ సినిమా రైట్స్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం వేచిచూసే దోరణిలో ఉండిపోయింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. ‘పుష్ప ది రూల్’ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా, హిందీ, ఓవర్సీస్, రష్యా, చైనా కలిపి మొత్తంగా చిత్రయూనిట్ 1050 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. ఇది ఓకే అయితే RRR పేరున ఉన్న 900కోట్ల రికార్డు కనుమరుగవుతుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.