Puvwada | పొంగులేటి సిద్ధాంతం, విలువలు లేని నేత: మంత్రి పువ్వాడ

Puvwada Ajay Kumar విధాత‌: పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు బలంతో విర్రవీగుతున్నారని, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేని దుస్థితిలో ఆయన ఉన్నారు. పొంగులేటి ఓ సిద్ధాంతం, విలువలేని నేత అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ఆయన అతిగా ఊహించుకుంటున్నార‌న్నారు. పేదలను పీడించిన దోపిడీదారులే ఆయన పంచన చేరారు. కాంట్రాక్టులు చేసుకొని ఒక్కడు బాగుపడితే జిల్లా పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో ఉండి సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేశారని, పద్ధతి మార్చుకోవాలని సీఎం […]

  • Publish Date - May 22, 2023 / 03:38 PM IST

Puvwada Ajay Kumar

విధాత‌: పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు బలంతో విర్రవీగుతున్నారని, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేని దుస్థితిలో ఆయన ఉన్నారు. పొంగులేటి ఓ సిద్ధాంతం, విలువలేని నేత అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ఆయన అతిగా ఊహించుకుంటున్నార‌న్నారు.

పేదలను పీడించిన దోపిడీదారులే ఆయన పంచన చేరారు. కాంట్రాక్టులు చేసుకొని ఒక్కడు బాగుపడితే జిల్లా పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో ఉండి సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేశారని, పద్ధతి మార్చుకోవాలని సీఎం ఎన్నిసార్లు చెప్పినా పొంగులేటి మారలేదన్నారు. వ్యక్తుల మీద పార్టీ ఆధారపడి ఉండదని మంత్రి తెలిపారు.