Rahul Gandhi | నెలలో బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌కు తాఖీదులు

విధాత : పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సి వస్తున్నది. లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో ఒక్కో విభాగం తమ పనులు చేసుకుంటూ పోతున్నాయి. ఇదే క్రమంలో తుగ్లక్‌ రోడ్‌లోని బంగ్లాను ఖాళీ చేయాలంటూ లోక్‌సభ హౌసింగ్‌ ప్యానల్‌ మాజీ ఎంపీకి నోటీసు జారీ చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడినందున […]

  • Publish Date - March 27, 2023 / 01:39 PM IST

విధాత : పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సి వస్తున్నది. లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో ఒక్కో విభాగం తమ పనులు చేసుకుంటూ పోతున్నాయి.

ఇదే క్రమంలో తుగ్లక్‌ రోడ్‌లోని బంగ్లాను ఖాళీ చేయాలంటూ లోక్‌సభ హౌసింగ్‌ ప్యానల్‌ మాజీ ఎంపీకి నోటీసు జారీ చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడినందున ప్రభుత్వ నివాసాన్ని ఉపయోగించుకునే వీలు లేదని స్పష్టం చేసింది. నెల రోజుల వ్యవధిలో బంగ్లాను ఖాళీ చేయాలని కోరింది. అయితే తమకు ఇంకా నోటీసు అందలేదని రాహుల్‌గాంధీ సిబ్బంది చెబుతున్నారు.