రాహుల్ రాజ‌కీయాల‌కు ప‌నికి రారు: బీజేపీ సీఎం

విధాత : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల ప‌ట్ల రాహుల్ గాంధీ సీరియ‌స్‌గా లేర‌ని వ్యాఖ్యానించారు. బాధ్య‌త‌రాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తే రాజ‌కీయాల‌కు ప‌నికి రార‌ని రాహుల్‌ను విమ‌ర్శించారు. ఆయ‌న‌కు ఏ ప‌ని చేయాలో, ఏ ప‌ని చేయ‌కూడ‌దో అస‌లే తెలియ‌ద‌న్నారు. చేయొద్ద‌న్న ప‌నినే రాహుల్ చేస్తార‌ని మండిప‌డ్డారు. పార్టీకి సంబంధించిన మీటింగ్స్ జ‌రుగుతున్న‌ప్పుడు రాహుల్ నిర్ల‌క్ష్యంగా ఉండేవార‌ని గుర్తు చేశారు. స‌మావేశం మ‌ధ్య‌లోనే ప‌క్క రూమ్‌లోకి […]

రాహుల్ రాజ‌కీయాల‌కు ప‌నికి రారు: బీజేపీ సీఎం

విధాత : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల ప‌ట్ల రాహుల్ గాంధీ సీరియ‌స్‌గా లేర‌ని వ్యాఖ్యానించారు. బాధ్య‌త‌రాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తే రాజ‌కీయాల‌కు ప‌నికి రార‌ని రాహుల్‌ను విమ‌ర్శించారు. ఆయ‌న‌కు ఏ ప‌ని చేయాలో, ఏ ప‌ని చేయ‌కూడ‌దో అస‌లే తెలియ‌ద‌న్నారు. చేయొద్ద‌న్న ప‌నినే రాహుల్ చేస్తార‌ని మండిప‌డ్డారు.

పార్టీకి సంబంధించిన మీటింగ్స్ జ‌రుగుతున్న‌ప్పుడు రాహుల్ నిర్ల‌క్ష్యంగా ఉండేవార‌ని గుర్తు చేశారు. స‌మావేశం మ‌ధ్య‌లోనే ప‌క్క రూమ్‌లోకి వెళ్లి జాగింగ్ చేసి విశ్రాంతి తీసుకొనేవారు. మ‌ళ్లీ మీటింగ్‌కు హాజ‌ర‌య్యే వార‌ని తెలిపారు. ఆయ‌న‌కు రాజ‌కీయాల ప‌ట్ల సీరియ‌స్‌నెస్ లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు కాన‌ప్పుడు.. అన్ని నిర్ణ‌యాలు తానే ఎందుకు తీసుకుంటున్నారంటూ రాహుల్‌ను ఉద్దేశించి హిమంత బిశ్వ శ‌ర్మ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీని త‌న చేతుల్లో పెట్టుకున్నార‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం రాహుల్ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర స‌క్సెస్ కాద‌న్నారు. రాహుల్, సోనియా పేద‌ల నివాసాల‌కు వెళ్తారు. కానీ ఎప్పుడైనా పేద‌ల‌ను త‌మ నివాసాల‌కు ఆహ్వానించారా? సోనియా, రాహుల్.. నిరుపేద‌ల ఇండ్ల‌లో భోజ‌నం చేశారా? అని ప్ర‌శ్నించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిగ‌జారి పోయింద‌న్నారు. హిమంత బిశ్వ శ‌ర్మ 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.