" /> " /> " /> " />

Rahul Gandhi | రాహుల్‌పై అనర్హత.. తీవ్రంగా ఖండిస్తున్న విదేశాలు – vidhaatha

Rahul Gandhi | రాహుల్‌పై అనర్హత.. తీవ్రంగా ఖండిస్తున్న విదేశాలు

విధాత‌: ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని సులభంగా తొక్కి వేయవచ్చునని మోదీ ప్రభుత్వం భావిస్తే అది ఉత్తి భ్రమే అని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాహుల్ పై అనర్హత వేటు దేశ విదేశాలలో ప్రకంపనలు పుట్టుకొస్తాయని మోదీ ప్రభుత్వం ఊహించి ఉండదు. "మేం భారతీయ న్యాయస్థానాలలో రాహుల్ గాంధీ కేసును గమనిస్తున్నాం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటుగా రెండు దేశాలలో ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతపై భారత ప్రభుత్వంతో సంభాషిస్తున్నాం. […]

  • Publish Date - March 30, 2023 / 01:34 PM IST

విధాత‌: ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని సులభంగా తొక్కి వేయవచ్చునని మోదీ ప్రభుత్వం భావిస్తే అది ఉత్తి భ్రమే అని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాహుల్ పై అనర్హత వేటు దేశ విదేశాలలో ప్రకంపనలు పుట్టుకొస్తాయని మోదీ ప్రభుత్వం ఊహించి ఉండదు.

“మేం భారతీయ న్యాయస్థానాలలో రాహుల్ గాంధీ కేసును గమనిస్తున్నాం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటుగా రెండు దేశాలలో ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతపై భారత ప్రభుత్వంతో సంభాషిస్తున్నాం.

ప్రజాస్వామిక సూత్రాలు, మానవ హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించడం రెండు దేశాల ప్రజాస్వామ్యాలు బలోపేతం చేయడంలో కీలకమైనవి అని చెబుతాం’ అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి అయిన వేదాంత్ పటేల్ అన్నారు. భారతీయ న్యాయస్థానాలపై నమ్మకం ఉంది అంటూనే, పరిస్థితిని గమనిస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది.

రాహుల్ పై అనర్హత వేటును గమనించామని జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ వ్యాఖ్యను జర్మనీ అధికార అంతర్జాతీయ ప్రసార సంస్థ డ్యూష్ వెల్లె ప్రసారం చేసింది. తమకు తెలిసిన సమాచారం ప్రకారం రాహుల్‌ అప్పీలు చేసుకునే అవకాశం ఉందని కూడా అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు. రాహుల్ పై తీర్పు నిలబడుతుందా, సస్పెన్షన్ నిలుస్తుందా అనేది తేలవలసి ఉందని కూడా పేర్కొన్నారు. జర్మనీ తన అనర్హతపై స్పందించినందుకు రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

అధికారికంగా వ్యాఖ్యానించక పోయినా యూరప్ ప్రభుత్వాల దృష్టిలో ఈ వ్యవహారం ఉన్నది. ప్రతిపక్ష నేతను లోక్సభ నుంచి తొలగించడంపై అంతర్జాతీయంగా ప్రసార మాధ్యమాలలో ప్రధానాంశమైంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఒమన్, నైజీరియా, సింగపూర్ వంటి పలు దేశాలలో ఈ వార్త సంచలనం సృష్టించింది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భారత్‌కు పాశ్చాత్య దేశాలలో ఎంతో గౌరవం ఉంది. మోదీ హయాంలో మానవ హక్కుల ఉల్లంఘన గురించి విదేశాలలోని హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆర్ధిక పరిస్థితి. దిగజారిందనేది అనేక నివేదికలలో వెల్లడైంది. అదానీ వంటి పారిశ్రామిక వేత్తలతో అంటకాగడం కూడా విదేశాలలో చర్చనీయాంశంగా ఇప్పటికే మారింది.

మోదీ ప్రభుత్వం ఇప్పటికే అప్రతిష్ట పాలైన నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు విదేశాలలో తీవ్రమైన అంశంగా మారడంలో ఆశ్చర్యం లేదు. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్ధలు బలంగా ఉన్నందు, న్యాయ వ్యవస్థపై గౌరవం వల్ల ఆచితూచి వ్యవహరిస్తాయి. కానీ ఇక్కడి పరిణామాలను గమనిస్తున్నాయనే

సంకేతాలు అమెరికా, జర్మనీ దేశాల స్పందనలను బట్టి స్పష్టమైంది. ప్రత్యక్ష పరోక్ష మార్గాల ద్వారా మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి రావడం ఖాయం. తమను విదేశాల దౌత్య వర్గాలు ఈ పరిణామలపై అడగలేదని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఒక సమావేశంలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చుకోవలసి వచ్చింది. దీన్ని బట్టి మోదీ ప్రభుత్వం ఆడింది ఆటగా ఉండదని తెలిసిపోతున్నది. ప్రధాని మోదీ విదేశాలలో ఎక్కడికి పోయినా సభ్య సమాజం నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వస్తుంది.

“భారత్లో కింది స్థాయి నాయకులు సోషల్ మీడియాలో ఇతర వేదికల మీద తీవ్రమైన పదజాలం వాడుతున్నారు….. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అసాధారణం.. ఇంతటి శిక్ష వేయడం ద్వారా మోదీకి సవాలుగా ఉన్న ప్రధాన నాయకుడిని తొలగించాలను కోవడం గతంలో ఎన్నడూ వినలేదు’ అని అమెరికాలోని మిషిగాన్ విశ్వవిద్యాలయం లో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాయ్బత్ పాల్ వ్యాఖ్యానించారు.

దేశంలో…

అనర్హత వేటు వేయడం వల్ల దేశంలో కూడా రాహుల్ గాంధీకి గతంలో ఎప్పుడూ లేనంత మద్దతు వచ్చింది. 19 ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడం సాధారణమైన విషయం కాదు. ఇప్పటి వరకు కాంగ్రెస్తో కలువకుండా దూరంగా ఉంటున్న సమాజ్వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఇప్పుడు రాహుల్కు మద్దతుగా కలిసి వచ్చాయి. సావర్కర్పై వ్యాఖ్య విషయంలో రాహుల్తో విభేదించానా, కాంగ్రెస్కు దూరం కాబోమనే సంకేతాన్ని శివసేన ఇచ్చింది.

లోక్సభలో ప్రస్తుతానికి యాభై ప్లస్ సీట్లు మాత్రమే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి పెద్ద పోటీ దారు. బీజేపీ బలంగా ఉన్న చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి. ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ పెద్ద సమస్య కాదనీ, కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధిస్తానని ప్రధాని మోదీ భావించారు.

కానీ అది సాధ్యమయ్యే పనికాదని తెలిసిపోయింది. రాహుల్ గాంధీ మోదీ ఇంటి పేరు పై చేసిన వ్యాఖ్య పెద్ద ఘోరమైనదేమీ కాదు. కానీ దానిపై న్యాయస్థానానికి వెళ్ళి ఇరుకున పెట్టాలన్న కుట్రలు నెరవేరక పోగా, కాంగ్రెస్కే లాభిస్తున్నది.