Rajanna Sirisilla: ప్రభుత్వ పాఠశాలలకు వసతుల కల్పనలో తెలంగాణ చివరి స్థానం
ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు చెన్నమనేని వికాస్, దీప విధాత, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ అన్ని విషయాలలో నెంబర్ వన్ అంటున్నారు… కానీ ఒక్క విషయంలో తెలంగాణ చివరి స్థానంలో ఉంది.. రాష్ట్రంలో 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 2000 పాఠశాలలకు టాయిలెట్స్ లేవు , 11000 పాఠశాలలకు నల్లాలు లేవన్నారు ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప దంపతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు ఫౌండేషన్ […]

- ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు చెన్నమనేని వికాస్, దీప
విధాత, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ అన్ని విషయాలలో నెంబర్ వన్ అంటున్నారు… కానీ ఒక్క విషయంలో తెలంగాణ చివరి స్థానంలో ఉంది.. రాష్ట్రంలో 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 2000 పాఠశాలలకు టాయిలెట్స్ లేవు , 11000 పాఠశాలలకు నల్లాలు లేవన్నారు ప్రతిమ ఫౌండేషన్
నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప దంపతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని వీరు అందజేశారు.
శుద్ద జల కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప దంపతులకు గ్రామ సర్పంచ్, పాలక వర్గం, స్వామి వివేకనంద సేవా సమితి సభ్యులు, మహిళలు మంగళ హారతులతో డప్పు చప్పుళ్ళతో స్వాగతం పలికారు. ఉన్నత పాఠశాలలో శుద్ద జల కేంద్రం ప్రారంభించిన అనంతరం
చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ కలుషిత నీరు తాగడం వలన వచ్చే జబ్బులను శుద్ధ జలం తాగడం ద్వారా రక్షించు కోవచ్చు అన్నారు.
విద్యార్థి దశ నుండే సాంకేతిక పరిజ్ఞానం, నైతిక విలువలు కలిగిన అంశాలని నేర్చుకుంటే ప్రతి విద్యార్థి తమ జీవితంలో విజయవంతం అవుతారన్నారు. విద్యార్థులు మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పిల్లలకు రక్షిత నీరు అందకపోయినా, నీరు సరిగా తాగకపోయిన కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి దీనిపై ప్రభుత్యం దృష్టి సారించాలని అన్నారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి ఎస్. ఎం. సి చైర్మన్ పులి రాజేందర్, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్, వివేకానంద సేవా సమితి అధ్యక్షులు కృష్ణ, మదన్ రావు, సతీష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.