గోషామహల్ నుంచి గెలిచిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు ఇవే ఆఖరి అసెంబ్లీ సమావేశాలు అని, రానున్న అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చని అన్నారు. శనివారం అయన సభలో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడం లేదని అన్నారు.
ముస్లింలకు వ్యతిరేకంగా, ఇంకా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారు అని భావించిన ప్రభుత్వం 25 ఆగస్టు 2022 లో అరెస్ట్ అయ్యారు. అయితే ఆ తరువాత అయన నవంబర్లో విడుదల అయ్యారు. ఈలోపు ఆయన్ను బిజెపి సస్పెండ్ చేసేసింది.
ఇదిలా ఉండగానే అయన ఆమధ్య హరీష్ రావును కలవడంతో పలు పుకార్లు వచ్చాయి. అయన బిజెపిని వీడతారని, కేసీఆర్ సారధ్యంలోని భారత రాష్ట్ర సమితిలో చేరతారని పుకార్లు వచ్చాయి. అయితే తనమీద ఉన్న సస్పెన్షన్ ఇంకా బిజెపి తొలగించలేదు.
ఒకవేళ ఆ సస్పెన్షన్ రద్దు చేస్తే తాను ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. అయితే తానూ బిజెపిని వీడేదిలేదని అయన అంటున్నారు. ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తే ఎమ్మెల్యేసీట్ల మీద కూడా ప్రభావం ఉంటుందని, అక్కడ సైతం బిజెపి గెలించేందుకు మార్గం సులభం అవుతుందని పార్టీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన్ను ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన మాత్రం ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేది లేదని తెలుస్తోంది.