రాజస్థాన్‌లో 11.30 వరకు 24.74 శాతం పోలింగ్
రాజస్థాన్‌లోని 119 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటల వరకు 24.74 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది.

- బరిలో 1,862 మంది అభ్యర్థులు
- 5,25,38,105 మంది ఓటర్లు
విధాత: రాజస్థాన్‌లోని 119 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటల వరకు 24.74 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు ముఖాముఖీగా తలపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 200 నియోజకవర్గాలకుగాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్మిత్ సింగ్ కునార్ చనిపోయిన నేపథ్యంలో కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో పోలింగ్ వాయిదాపడింది. 5,25,38,105 మంది ఓటర్లు ఉండగా 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, శాంతి ధరివాల్, బిడి కల్లా, భన్వర్ సింగ్ భాటి, సలేహ్ మహ్మద్, మమతా భూపేష్, ప్రతాప్ సింగ్ ఖచరియావాస్, రాజేంద్ర సహా పలువురు మంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీలో విపక్ష నేత రాజేంద్ర రాథోడ్, ప్రతిపక్ష ఉపనేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఎంపీలు దియా కుమారి, రాజ్యవర్ధన్ రాథోడ్, బాబా బాల్కనాథ్, కిరోడి లాల్ మీనా కూడా అసెంబ్లీ బరిలో నిలిచారు. పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.