బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ.. భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో కెరీర్‌లో అతి పెద్ద విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో రామ్ చరణ్‌కి గ్లోబల్ స్టార్‌డమ్ వచ్చింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాగా లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ సినిమా చేస్తూనే రామ్ చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసే సినిమాలన్నీ కూడా హై స్టాండర్డ్స్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. త్వరలో రామ్ చరణ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయయనున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఒక యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లిన చరణ్‌ను రాజ్‌కుమార్ హిరానీ కలవగా, ఓ కథను కూడా నెరేట్ చేశాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.
దీంతో రామ్ చరణ్- రాజ్ కుమార్ హిరాని సినిమా పట్టాలెక్కడం ఖాయం అని టాక్ నడుస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అంత ఆశామాశీ కాదు. రాజ్ కుమార్ రెండు మూడేళ్లకు సినిమా చేస్తుంటాడు. అది కూడా ఇండస్ట్రీ హిట్ పక్కాగా తీస్తాడు.
రాజ్ కుమర్ హిరాని తన 20ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన తీసినవి ఐదు సినిమాలే అంటే.. రాజ్ కుమార్ ట్రాక్ రికార్డ్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాజ్ కుమార్ ఆరో సినిమాగా డంకీ మూవీ చేస్తుండగా, దీనిని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత రాజ్ కుమార్ హిరాని వెంటనే రామ్ చరణ్ తో సినిమా చేస్తాడా.. ఇంత త్వరగా స్క్రిప్ట్ రెడీ అవుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ సినిమాలు అయిపోయే సరికి రెండు మూడేళ్ల పట్టే అవకాశం ఉండగా, ఆ తర్వాతే రామ్ చరణ్- రాజ్ కుమార్ హిరాణి కలిసి పని చేయనున్నారని తెలుస్తుంది.