రష్మిక ‘బ్రా’ డ్రెస్‌.. కామెంట్లే కామెంట్లు

విధాత‌: హీరోయిన్లందరూ కెరీర్ ప్రారంభంలో చాలా సంప్రదాయంగా నిండుదనంతో కూడిన దుస్తులు ధరిస్తూ అచ్చమైన భారతీయ వనితల్లా కనిపిస్తారు. కానీ కాస్త ఫేమ్ వచ్చి లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత వారు కూడా విచ్చలవిడిగా స్కిన్ షో చేస్తారు. ఇక సౌత్ భామలు బాలీవుడ్‌పై కన్నేస్తే దానికి తిరుగే లేదు. బాలీవుడ్‌లో తాము ధరించే దుస్తులు, స్కిన్ షోలతో వేడి పుట్టిస్తారు. వాతావరణాన్ని హీటెక్కిస్తారు. తద్వారా మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. కన్నడ భామ […]

  • Publish Date - January 21, 2023 / 03:25 AM IST

విధాత‌: హీరోయిన్లందరూ కెరీర్ ప్రారంభంలో చాలా సంప్రదాయంగా నిండుదనంతో కూడిన దుస్తులు ధరిస్తూ అచ్చమైన భారతీయ వనితల్లా కనిపిస్తారు. కానీ కాస్త ఫేమ్ వచ్చి లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత వారు కూడా విచ్చలవిడిగా స్కిన్ షో చేస్తారు. ఇక సౌత్ భామలు బాలీవుడ్‌పై కన్నేస్తే దానికి తిరుగే లేదు. బాలీవుడ్‌లో తాము ధరించే దుస్తులు, స్కిన్ షోలతో వేడి పుట్టిస్తారు. వాతావరణాన్ని హీటెక్కిస్తారు. తద్వారా మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు.

కన్నడ భామ రష్మిక మందన్న కన్నడంలో ‘కిర్రిక్ పార్టీ’ ద్వారా పరిచయమైంది. తెలుగులో ‘ఛలో’తో పరిచయమైన ఈమె అనతి కాలంలోనే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్లతో చేసే రేంజ్‌కి ఎదిగింది. తాజాగా ఆమె కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘వారిసు’ చిత్రంలో నటించింది.