చేతిపై బీర్ బాటిల్ ప‌గ‌ల‌గొట్టుకున్న ర‌వితేజ‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్

  • By: sn    latest    Oct 15, 2023 8:58 AM IST
చేతిపై బీర్ బాటిల్ ప‌గ‌ల‌గొట్టుకున్న ర‌వితేజ‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్

గ‌త కొద్ది రోజులుగా వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బందిప‌డుతున్న ర‌వితేజ ఒక మంచి హిట్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని ద‌సరా కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో ర‌వితేజ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో కూడా చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఇక‌‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ అన్ని రాష్ట్రాల్లోనూ ఫుల్ స్వింగ్ లో న‌డుస్తుంది. బాలీవుడ్‌పై చిత్ర బృందం ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తూ.. అక్కడి ఛానల్స్, సైట్స్, మీడియాకు తెగ ఇంట‌ర్వ్యూలు ఇస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.


రీసెంట్‌గా బాలీవుడ్ టీవీ షోలో కూడా పాల్గొ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ సినిమాని ప్రమోట్ చేసారు ర‌విత‌జే అండ్ టీం. ‘ఇండియాస్ గాట్ ట్యాలెంట్’ అనే షో ర‌వితేజ‌తో పాటు చిత్ర హీరోయిన్స్ పాల్గొన‌గా, వారు చేసిన సంద‌డికి సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో ముందుగా ర‌వితేజ త‌న హీరోయిన్స్‌తో క‌లిసి డ్యాన్స్ చేశాడు. అనంత‌రం బీర్ బాటిల్‌ని చేతిపై ప‌గ‌ల‌గొట్టుకున్నాడు. ఇది చూసి అంద‌రు షాక‌వుతున్నారు. ఏంటి ర‌వితేజ ఇంత ధైర్యం చేశాడేంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే ర‌వితేజ త‌న సినిమాల కోసం ఇలాంటి స్టంట్స్ ఎన్నో చేశారు. ఇది అంత పెద్ద విష‌యం కాదు అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ర‌వితేజ ఇలా చేయ‌డం మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.


ఇక ర‌వితేజ న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రం అక్టోబ‌ర్ 20న విడుద‌ల కానుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై ద‌ర్శ‌కుడు వంశీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా, అలనాటి హీరోయిన్, ప‌వన్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. ల‌వ‌ణం పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నుంది. ఇక అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండ‌గా, ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌లైన బాణీలు శ్రోత‌ల‌ని ఎంత‌గానో అలరిస్తున్నాయి.