Rayapati Sambasivarao | వైసిపిలోకి ఎంట్రీకి రాయపాటి ప్రయత్నం

Rayapati Sambasivarao విధాత‌: సీనియర్ నాయకుడు గుంటూరు జిల్లాలో ఎదురులేని నాయకుడిగా ముప్పయ్యేళ్లపాటు చక్రం తిప్పిన రాయపాటి సాంబశివరావు ఇప్పుడు ఐదేళ్లుగా రాజకీయ గుర్తింపు లేకుండా ఉన్నారు. గుంటూరు నరసరావుపేటల నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచినా రాయపాటి గత ఐదేళ్లుగా పదవులేమిలేక నిరుద్యోగిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచినా రాయపాటి రాష్ట్ర విభజన తరువాత 2014లో కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరి నరసరావుపేట ఎంపీగా గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఓడిపోగా […]

  • Publish Date - July 14, 2023 / 03:22 AM IST

Rayapati Sambasivarao

విధాత‌: సీనియర్ నాయకుడు గుంటూరు జిల్లాలో ఎదురులేని నాయకుడిగా ముప్పయ్యేళ్లపాటు చక్రం తిప్పిన రాయపాటి సాంబశివరావు ఇప్పుడు ఐదేళ్లుగా రాజకీయ గుర్తింపు లేకుండా ఉన్నారు. గుంటూరు నరసరావుపేటల నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచినా రాయపాటి గత ఐదేళ్లుగా పదవులేమిలేక నిరుద్యోగిగా ఉన్నారు.

కాంగ్రెస్ నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచినా రాయపాటి రాష్ట్ర విభజన తరువాత 2014లో కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరి నరసరావుపేట ఎంపీగా గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఓడిపోగా ఇప్పుడు గత నాలుగేళ్లుగా ఖాళీగా ఉంటున్నారు. మళ్ళీ సత్తెనపల్లి నుంచి పోటీ చేద్దాం అని భావిస్తున్న రాయపాటి ఆశలను చంద్రబాబు తుంచేస్తూ అక్కడ కన్నాలక్ష్మి నారాయణకు అవకాశం ఇచ్చారు. దీంతో తనకు అక్కడ అవకాశాలు మూసుకుపోవడంతో రాయపాటి ఇప్పుడు జగన్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

తనకు పార్టీలో చేరే అవకాశం ఇస్తే ఎంపీ, ఎమ్మెల్యే ఏదో ఒక సీట్ ఇస్తే గెలుస్తానని తనకు పార్టీలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని రాయబారం పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఎక్కడ సీట్ ఇవ్వాలి..? ఎలా సర్దుబాటు చేయాలన్నది ఇంకా తెలియడం లేదు. సత్తెనపల్లి లో గెలిచిన అంబటి రాంబాబు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు.

మొదటినుంచీ జగన్ వెంట ఉన్న అంబటి మీద ఈమధ్య వ్యతిరేకత పెరిగినట్లు తెలుస్తోంది. అయన గెలుపు కష్టం అన్న సూచనలు వస్తున్నాయి. అలా అయితే ఆయనను పోటీ నుంచి తప్పించి రాయపాటికి టికెట్ ఇస్తారేమో చూడాలి. ఇలాంటి ముదురు టికెట్లతో తలనొప్పి.. గెలిచాక మన కంట్రోల్లో ఉండరు.. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటే జగన్ టికెట్ అవకాశం ఇవ్వకపోవచ్చు..

కానీ అయన ఐతే తన ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. ఇప్పటికే సత్తెనపల్లి టికెట్ మీద ఆశ‌లు పెట్టుకుని భంగపడిన కోడెల శివరాం (దివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు ) సైతం ఇప్పటికే టిడిపి మీద నిప్పులు గక్కుతున్నారు.. ఇప్పుడు రాయపాటి సైతం అదే బాటలో ఉన్నారు.