రేణూ దేశాయ్ అంత భయంకరమైన వ్యాధితో బాధపడుతుందా.. నరకం చూస్తుందట..!

బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భార్యగా అశేషప్రజల అభిమానాన్ని చూరగొంది రేణూ దేశాయ్. కొన్నాళ్లపాటు పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ చాలా అన్యోన్యంగా ఉండగా, అనుకోని కారణాల వలన వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరి దాంపత్యంలో అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. పవన్ నుండి విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్.. పిల్లల బాగోగులు చూసుకుంటూ గడుపుతుంది.చాలా రోజుల తర్వాత రేణూ దేశాయ్ వెండితెర రీఎంట్రీ ఇచ్చింది. టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో త్వరలోనే పలకరించనుంది. ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ అనేక ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది.
తాజాగా రేణూ దేశాయ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ పెద్ద షాక్ ఇచ్చింది. తాను మయోకార్డియల్ బ్రిడ్జింగ్ వ్యాధితో బాధపడుతున్నానని , ఈ వ్యాధి తనకు తన నాన్నమ్మ నుంచి వారసత్వంగా వచ్చిందని చెప్పుకొచ్చింది.ఈ వ్యాధి జెనటిక్ ప్రాబ్లమ్ కాగా నాన్నమ్మ నుండి తండ్రికి వచ్చింది. తండ్రి నుండి నాకు వచ్చిందని పేర్కొంది. మయోకార్డియల్ బ్రిడ్జింగ్ గుండెకి సంబంధించిన వ్యాధి అని, దానికి బైపాస్ సర్జరీ లాంటివి ఏమీ లేవని స్పష్టం చేసింది. ఇది పుట్టుకతో రావడం వల్ల అప్పటి నుండి ఇబ్బంది పడుతూనే ఉన్నాను. మందులు వేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటున్నాను. కాకపోతే మందుల వలన చాలా లావు అవుతున్నాను. ఈ వ్యాధి వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను.
కొద్ది దూరం నడిచిన కూడా అలసిపోవడం, గుండె నొప్పి రావడం జరుగుతుందని రేణూ దేశాయ్ పేర్కొంది. నేను ఎప్పటికప్పుడు నా హార్ట్ బీట్స్‌ను చెక్ చేయటానికి యాపిల్ వాచ్ వాడుతున్నానని , ఎప్పుడైతే హార్ట్ రేట్ పెరుగుతుందో అప్పుడు ఆ విషయాన్ని తన వాచీ తెలియజేస్తుందని, బీటా బ్లాకర్స్ వాడుతున్నట్టు రేణూ పేర్కొంది.దీనిని నేను జీవితాంతం ఫేస్ చేయాల్సిందే. ఎంతో మంది డాక్టర్స్‌ని కలిసిన కూడా పెద్దగా ప్రయోజనం లేదు. వారు బీటా బ్లాకర్స్‌ను వాడటమే పరిష్కారమని చెప్పారని రేణూ దేశాయ్ స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ ఆమెకి ధైర్యం అందిస్తున్నారు.ఏ మాత్రం అధైర్యపడొద్దు అంటూ సూచనలు చేస్తున్నారు.