Revanth Reddy | వరుస డిక్లరేషన్‌లకు కాంగ్రెస్ రెడీ

26న చేవెళ్లలో దళిత డిక్లరేషన్‌ 29న వరంగల్‌లో మైనార్టీ డిక్లరేషన్‌ ఓబీసీ డిక్లరేషన్‌కు రాహుల్‌, సీఎం సిద్ధరామయ్యలు మహిళ డిక్లరేషన్‌కు ప్రియాంకాగాంధీ సోనియాగాంధీ చేతుల మీదుగా మ్యానిఫెస్టో విడుదల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడి Revanth Reddy | విధాత: అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనే దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుస డిక్లరేషన్‌ల ప్రకటనలతో పాటు నియోజవర్గాల వారిగా క్షేత్ర స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణతో ముందుకెలుతుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం రేవంత్ […]

  • By: Somu    latest    Aug 19, 2023 12:27 AM IST
Revanth Reddy | వరుస డిక్లరేషన్‌లకు కాంగ్రెస్ రెడీ
  • 26న చేవెళ్లలో దళిత డిక్లరేషన్‌
  • 29న వరంగల్‌లో మైనార్టీ డిక్లరేషన్‌
  • ఓబీసీ డిక్లరేషన్‌కు రాహుల్‌, సీఎం సిద్ధరామయ్యలు
  • మహిళ డిక్లరేషన్‌కు ప్రియాంకాగాంధీ
  • సోనియాగాంధీ చేతుల మీదుగా మ్యానిఫెస్టో విడుదల
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడి

Revanth Reddy | విధాత: అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనే దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుస డిక్లరేషన్‌ల ప్రకటనలతో పాటు నియోజవర్గాల వారిగా క్షేత్ర స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణతో ముందుకెలుతుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం రేవంత్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే, కార్యదర్శి మన్సూల్ అలిఖాన్‌, డి.శ్రీధర్‌బాబు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభృతులు హాజరయ్యారు. సమావేశం వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఈ నెల 26న చేవెళ్లలో సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్న ప్రజాగర్జన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హాజరవుతారని, ఈ సభలో ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేస్తారని తెలిపారు. ఖమ్మం సభలాగే కాంగ్రెస్ శ్రేణులు చేవెళ్ల సభ విజయవంతానికి కృషి చేయాలన్నారు. 29న మైనారిటీ డిక్లరేషన్ ను వరంగల్ లో విడుదల చేయాలని భావిస్తున్నామని, సెప్టెంబర్ 6-9తేదిల మధ్య ఒబీసి డిక్లరేషన్ విడుదల చేస్తామని ఈ సభకు రాహుల్‌గాంధీ సహా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహ్వానించనున్నామని తెలిపారు.

ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేశామని, మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామన్నారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేయించాలని పీసీసీ నిర్ణయించిందన్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈనెల 21నుంచి 25వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, ఓక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఓక్కో పీసీసీ ఉపాధ్యక్షుడు కోఆర్డినెటర్లుగా ఉంటారన్నారు. తిరుగబడుదాం..తరిమికొడుదాం కార్యక్రమాన్ని గ్రామగ్రామాన నిర్వహించి, ప్రతి గడపకు చేర్చాలని, ప్రతి తలుపు తట్టేలా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్స్, చార్జ్ షీట్స్, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కర్ణాటక తరహాలో కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను ఇంటింటికీ చేరేలా చూడాలని, హాత్ సే హాత్ జోడో కార్యక్రమం తరహాలో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, నాయకులు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.