బాలికల పాఠశాలలోకి గోడ దూకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వీడియో వైర‌ల్

విధాత: తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌న పాద‌యాత్ర‌ను మ‌హ‌బూబాబాద్ జిల్లాలో కొన‌సాగిస్తున్నారు. అయితే జిల్లా ప‌రిధిలోని మ‌రిపెడ గ్రామంలోని గిరిజ‌న సంక్షేమ మినీ గురుకులం పాఠ‌శాల‌(బాలిక‌లు)లోకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి య‌త్నించారు. అయితే రేవంత్‌ను లేడిస్ హాస్ట‌ల్‌లోకి వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి హాస్ట‌ల్ గోడ దూకి లోప‌లికి ప్ర‌వేశించారు. అనంత‌రం విద్యార్థుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. హాస్ట‌ల్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను, ఇత‌ర అంశాల‌ను రేవంత్ రెడ్డి […]

  • By: krs    latest    Feb 09, 2023 1:21 PM IST
బాలికల పాఠశాలలోకి గోడ దూకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వీడియో వైర‌ల్

విధాత: తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌న పాద‌యాత్ర‌ను మ‌హ‌బూబాబాద్ జిల్లాలో కొన‌సాగిస్తున్నారు. అయితే జిల్లా ప‌రిధిలోని మ‌రిపెడ గ్రామంలోని గిరిజ‌న సంక్షేమ మినీ గురుకులం పాఠ‌శాల‌(బాలిక‌లు)లోకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి య‌త్నించారు.

అయితే రేవంత్‌ను లేడిస్ హాస్ట‌ల్‌లోకి వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి హాస్ట‌ల్ గోడ దూకి లోప‌లికి ప్ర‌వేశించారు. అనంత‌రం విద్యార్థుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.

హాస్ట‌ల్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను, ఇత‌ర అంశాల‌ను రేవంత్ రెడ్డి దృష్టికి విద్యార్థినులు తీసుకొచ్చారు. రేవంత్ లేడిస్ హాస్ట‌ల్ గోడ దూకిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా తమకు జీతాలు తక్కువగా ఉన్నాయని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించేలా చూడాలని, విద్యార్థులకు హాస్టల్ డైట్ చార్జీలు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయులు రేవంత్ కు విన్నవించగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామన్నారు.

MP కవితకు మియాపూర్‌లో 5 ఎకరాల భూమి ఎక్కడిది: KTRకు రేవంత్‌రెడ్డి సవాల్