RGV | పవన్‌పై ఆర్జీవీ సెటైర్లు.. జన సైనికులపై సానుభూతి.!

విధాత‌: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. ముఖ్యమంత్రి పదవి తదితర అంశాల మీద పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు జనసేనలోను, కాపు సామాజిక వర్గంలోనూ పెద్ద చర్చకు కారణమయ్యాయి. నాకెందుకు టీడీపీ వాళ్ళు సీఎం పదవి ఇస్తారు. నన్నెందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు.. అయినా నేను సీఎం పదవి అడగను.. సినిమా హీరోగా కూడా గమ్మున స్టార్‌డం రాలేదు. అలాగే సీఎం పోస్ట్ కూడా దైవ యోగం.. రాసిపెట్టి ఉంటే వస్తుంది. కానీ నేను మాత్రం ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వను. […]

  • Publish Date - May 12, 2023 / 10:09 AM IST

విధాత‌: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. ముఖ్యమంత్రి పదవి తదితర అంశాల మీద పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు జనసేనలోను, కాపు సామాజిక వర్గంలోనూ పెద్ద చర్చకు కారణమయ్యాయి. నాకెందుకు టీడీపీ వాళ్ళు సీఎం పదవి ఇస్తారు. నన్నెందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు.. అయినా నేను సీఎం పదవి అడగను.. సినిమా హీరోగా కూడా గమ్మున స్టార్‌డం రాలేదు.

అలాగే సీఎం పోస్ట్ కూడా దైవ యోగం.. రాసిపెట్టి ఉంటే వస్తుంది. కానీ నేను మాత్రం ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వను. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే నా లక్ష్యం అంటూ ఏదేదో మాట్లాడిన పవన్ మొత్తానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. తనకు సీఎం పదవి రాదని కానీ టీడీపీకి సపోర్ట్ చేయక తప్పదని పవన్ జనసైనికులకు చెప్పేశారు. సరిగ్గా ఈ పాయింట్స్ రామ్‌గోపాల్ వర్మ (RGV) పట్టుకున్నారు.

నాడు ఎన్టీయార్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లే.. పవన్ కళ్యాణ్ సైతం నేడు జనసైనికులకు వెన్నుపోటు పొడిచి మొత్తం పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టేశారని ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. మొత్తానికి పవన్ చేసిన కామెంట్స్, జనసైనికులు, ఇంకా కాపు యూత్, సీనియర్ కాపు ఉద్యమకారుల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. పవన్ కోసం కదా మేమంతా జెండాలు పెట్టుకున్నాం.. గతంలో ఆయన ఏమన్నారూ ఇన్నాళ్లు కమ్మ.. రెడ్లు మాత్రమే రాజ్యమేలారు.

ఇకనైనా కాపులు.. ఇతర కులాలకు చాన్స్ రావాలి.. నేను ఈ కులాలను ఏకం చేసి కమ్మ..రెడ్లకు ప్రత్యామ్నయంగా ఓ బలమైన శక్తిగా ఎదుగుతానని అంటేనే కదా మేమంతా మీ వెంట వస్తున్నాం. ఇప్పుడు మీరు కాపుల బలాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు అయితే మెమెందుకు మీ వెంట తిరగాలి. మమ్మల్ని.. మా బలాన్ని మీరు టిడిపికి అమ్ముకుంటే మెమెందుకు తలవంచాలి.