RGV:నేనే చిలిపి అనుకున్నా.. చిరంజీవి నా క‌న్నా చిలిపి: వ‌ర్మ‌

RGV: వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలిచే వ్య‌క్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఎప్పుడు స‌మాజంలో జ‌రిగే తాజా ప‌రిస్థితుల గురించి సెటైరిక‌ల్‌గా కామెంట్స్ చేస్తుంటారు. ఇక సినిమా ప‌రిశ్ర‌మ‌లో మెగా ఫ్యామిలీని ఎక్కువ‌గా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తూ ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా చిరంజీవిపై క్రేజీ కామెంట్ చేశారు. రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. భోళా శంక‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌లో చిరంజీవి.. […]

  • By: sn    latest    Aug 09, 2023 4:05 AM IST
RGV:నేనే చిలిపి అనుకున్నా.. చిరంజీవి నా క‌న్నా చిలిపి: వ‌ర్మ‌

RGV: వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలిచే వ్య‌క్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఎప్పుడు స‌మాజంలో జ‌రిగే తాజా ప‌రిస్థితుల గురించి సెటైరిక‌ల్‌గా కామెంట్స్ చేస్తుంటారు. ఇక సినిమా ప‌రిశ్ర‌మ‌లో మెగా ఫ్యామిలీని ఎక్కువ‌గా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తూ ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా చిరంజీవిపై క్రేజీ కామెంట్ చేశారు. రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. భోళా శంక‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌లో చిరంజీవి.. కీర్తి సురేష్‌తో చాలా స‌ర‌దాగా వ్య‌వ‌హ‌రించాడు. సినిమాల‌లో మేము అన్న, చెల్లెళ్లుగా న‌టించాము .ఆమెపై నాకు సోదర ప్రేమ వస్తుంది కానీ నేనే ఆ సోదర ప్రేమను చూపించకుండా ఆపుకుంటున్నానని చిరంజీవి స్ట‌న్నింగ్ కామెంట్స్ చేశారు.

తదుపరి సినిమాలో నేను ఆమెతో కలిసి హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నాను కాబ‌ట్టి ఆ సమయంలో అన్నాచెల్లెళ్ల అనుబంధం గుర్తు రాకూడదని నేను అనుకుంటున్నా.ఈ విషయాన్ని కీర్తి సురేష్ కి చెప్పాను అంటూ ఆమె చెంప‌ల‌ని ప‌ట్టుకొని చాలా చిలిపిగా మాట్లాడాడు చిరు. ఆ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు చాలా స‌ర‌దాగా అనుకున్నారు. అయితే దీని గురించి రామ్ గోపాల్ వ‌ర్మ త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. కీర్తి సురేష్‌తో చిరు వేసిన చిలిపి చేష్టల వీడియోని షేర్ చేస్తూ .. నా ఒక్కడిలోనే ఇంత చిలిపితనం వుందని నేను అపోహ పడ్డాను , కానీ మీలోనూ ఇంత వుందని గ్రహించలేకపోయాను అంటూ ఫ‌న్నీగా కామెంట్ చేశాడు వ‌ర్మ‌.

రామ్ గోపాల్ వర్మకి నాటి కోపం ఇంకా ఉందో ఏమో తెలియదు గానీ.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఏదో ర‌కంగా విమ‌ర్శిస్తూనే ఉంటాడు. చిరంజీవి మాత్రం ఇలాంటివి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అయితే భోళా శంకర్ ఈవెంట్లో హైపర్ ఆది .. వ‌ర్మపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్స్ వేసిన విష‌యం తెలిసిందే. ఓ పెద్ద డైరక్టర్ ఉన్నాడండి… ఆయ‌న చిన్న పెగ్ వేస్తే చిరంజీవిని, పెద్ద పెగ్ వేస్తే పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తుంటాడు.. ఆయనకు వాళ్లని విమర్శించే స్థాయి లేదంటూ ఇలా ఆర్జీవీ మీద పరోక్షంగా పంచ్‌లు పేల్చాడు. ఇది మ‌న‌సులో పెట్టుకున్నాడో ఏమో కాని ఇప్పుడు చిరంజీవిపై ఇలా త‌న అస‌హనం వ్య‌క్తం చేశాడు.