RGV: ఏంటి.. రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎయిడ్స్, కుష్టు వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడా…!

RGV: ఒకప్పుడు అద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించిన రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు కేవ‌లం వివాదాల‌తోనే వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లు విష‌యాల‌పై ఏదో ఒక వివాదం సృష్టించి హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబుల‌ని ఎక్కువ‌గా విమ‌ర్శిస్తూ వైఎస్ జ‌గ‌న్‌ని తెగ పొగిడేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు వ‌ర్మ‌. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏఐని ఉప‌యోగించి తన స‌రికొత్త లుక్ రిలీజ్ చేశాడు. ఈ లుక్‌లో రామ్ గోపాల్ వ‌ర్మ డాన్ […]

  • By: sn    latest    Jul 28, 2023 10:18 AM IST
RGV: ఏంటి.. రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎయిడ్స్, కుష్టు వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడా…!

RGV: ఒకప్పుడు అద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించిన రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు కేవ‌లం వివాదాల‌తోనే వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లు విష‌యాల‌పై ఏదో ఒక వివాదం సృష్టించి హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబుల‌ని ఎక్కువ‌గా విమ‌ర్శిస్తూ వైఎస్ జ‌గ‌న్‌ని తెగ పొగిడేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు వ‌ర్మ‌. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏఐని ఉప‌యోగించి తన స‌రికొత్త లుక్ రిలీజ్ చేశాడు. ఈ లుక్‌లో రామ్ గోపాల్ వ‌ర్మ డాన్ లుక్ లో క‌నిపిస్తున్నారు. ఆయ‌న లుక్ కి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపిస్తుంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుండ‌డంతో ఆర్టిస్ట్‌ల ఊహా శక్తికీ కూడా ఏఐ రెక్కలు తొడుగుతోంది అని చెప్పాలి. ఇటీవ‌ల ఏఐ టెక్నాల‌జీతో యాంక‌ర్స్ ని రూపొందించి న్యూస్ చదివిస్తున్నారు. మిడ్‌జ‌ర్నీ వంటి కొన్ని యాప్‌ల‌ను ఉప‌యోగిస్తూ ఇప్ప‌టివ‌ర‌కూ మ‌న ఊహ‌కు సైతం అంద‌ని ఇమేజ్‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ఏఐ చిత్రాన్నిసోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. పిక్‌లో రామ్ గోపాల్ వ‌ర్మ.. బ్లాక్ షేడ్స్ గ్లాసెస్ పెట్టుకుని సిగార్‌తో రా అండ్ రస్టిక్ లుక్‌లో డాన్ గెట‌ప్‌తో కనిపిస్తున్నాడు.

త‌న పోస్ట్‌కి వ‌ర్మ “ఐ గాట్ ఏఐ’డీ” అంటూ క్యాప్షన్ రాసాడు. ఆ ఫోటో డిజైన్ చేసిన ఏఐ ఆర్టిస్ట్ ఎవ‌రో మాత్రం వెల్ల‌డించ‌డ‌లేదు. ఇక ఈ పోస్ట్‌కి నెటిజ‌న్స్ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ఆ వేళ్లు ఏందిరా కుష్టు వ‌చ్చిన‌ట్టు ఉన్నాయి. ఎయిడ్స్ వ‌చ్చిందా ఏంటి అని దారుణ‌మైన కామెంట్స్ పెడుతున్నారు. కొంద‌రు వ‌ర్మ పిక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. ఇక వ‌ర్మ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం వ్యూహం అనే చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమాని ఎల‌క్ష‌న్స్ కి కొన్ని రోజుల ముందు రిలీజ్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు.