Road accident | మ‌హారాష్ట్ర‌లో ఘోరం.. ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి రైల్వే ట్రాక్‌పై ప‌డ్డ కారు.. బాధితులు హైద‌రాబాదీలే..!

Road accident విధాత‌: మ‌హారాష్ట్ర‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. 44వ జాతీయ ర‌హ‌దారిపై వెళ్తున్న ఓ కారు అదుపుత‌ప్పింది. దీంతో రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిపై నుంచి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై ప‌డింది. ఈ ప్ర‌మాదం నాగ్‌పూర్ - ఇంగ‌న్‌ఘాట్ మార్గంలోని బోర్‌ఖేడి స‌మీపంలో చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ రైల్వే లైన్‌లో మొత్తం నాలుగు ట్రాక్‌లు ఉండ‌గా, 3, 4 ట్రాక్‌ల మ‌ధ్య‌లో కారు ప‌డిపోయింది. కారు నుజ్జునుజ్జు అయింది. కారులో […]

  • By: Somu    latest    Jul 02, 2023 10:51 AM IST
Road accident | మ‌హారాష్ట్ర‌లో ఘోరం.. ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి రైల్వే ట్రాక్‌పై ప‌డ్డ కారు.. బాధితులు హైద‌రాబాదీలే..!

Road accident

విధాత‌: మ‌హారాష్ట్ర‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. 44వ జాతీయ ర‌హ‌దారిపై వెళ్తున్న ఓ కారు అదుపుత‌ప్పింది. దీంతో రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిపై నుంచి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై ప‌డింది. ఈ ప్ర‌మాదం నాగ్‌పూర్ – ఇంగ‌న్‌ఘాట్ మార్గంలోని బోర్‌ఖేడి స‌మీపంలో చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

ఈ రైల్వే లైన్‌లో మొత్తం నాలుగు ట్రాక్‌లు ఉండ‌గా, 3, 4 ట్రాక్‌ల మ‌ధ్య‌లో కారు ప‌డిపోయింది. కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు, పోలీసులు స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే ప్ర‌మాదానికి గురైన కారు నంబ‌ర్ ప్లేట్ టీఎస్ 13 సిరీస్‌తో ప్రారంభ‌మైన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో బాధితులు హైద‌రాబాదీలే అని తెలుస్తోంది. బాధితులంతా హైద‌రాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌తో రైళ్ల‌ను అర గంట పాటు నిలిపివేశారు. కారును ప‌క్క‌కు తొల‌గించిన త‌ర్వాత రైళ్ల రాక‌పోక‌ల‌కు అనుమ‌తించారు. దీంతో రైలు ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.