Godavari River Basara: గోదావరిలో ఐదుగురు యువకుల గల్లంతు!
విధాత, హైదరాబాద్ : నిర్మల్ జిల్లా బాసర వద్ధ గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మృతులంతా హైదరాబాద్ కు చెందిన ఒకే కుటుంబం వారని గుర్తించారు. వారికి ఈత రాకపోవడం..స్నానానికి దిగిన చోట నీళ్లలో లోతుగా ఉండటం వల్లే మునిగిపోయి మృతి చెందినట్లు సమాచారం. గల్లంతైన వారు హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన రాకేశ్, వినోద్, మదన్, రుతిక్, భరత్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
18 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పుణ్యస్నానాలకు బాసర వచ్చారు. ఇంతలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram