Rohit Sharma | అది భార‌త జ‌ట్టా, లేక ముంబై ఇండియ‌న్స్ టీమా?.. రోహిత్ శ‌ర్మ‌పై దారుణ‌మైన ట్రోలింగ్

Rohit Sharma | రానున్న రోజుల‌లో క్రికెట్ ప్రేమికుల‌కి మ‌స్త్ మ‌జా అంద‌నుంది. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ కొద్ది రోజుల గ్యాప్‌తో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు టోర్నీల‌లో భార‌త జ‌ట్టు పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డనుంది. ఇక ఈ సారి వ‌ర‌ల్డ్ క‌ప్ ఇండియా వేదిక‌గా జ‌ర‌గ‌నుండ‌డంతో పోరు మంచి రంజుగా ఉండ‌డం ఖాయ‌ంగా క‌నిపిస్తుంది. అయితే గ‌త సంవత్సర కాలంగా భారత జట్టును గాయాలు వేధిస్తుండ‌గా, కీల‌క ఆట‌గాళ్లు కీల‌క మ్యాచ్‌ల‌కి అందుబాటులో లేకుండా పోయారు. […]

  • By: sn    latest    Aug 23, 2023 2:26 AM IST
Rohit Sharma | అది భార‌త జ‌ట్టా, లేక ముంబై ఇండియ‌న్స్ టీమా?.. రోహిత్ శ‌ర్మ‌పై దారుణ‌మైన ట్రోలింగ్

Rohit Sharma |

రానున్న రోజుల‌లో క్రికెట్ ప్రేమికుల‌కి మ‌స్త్ మ‌జా అంద‌నుంది. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ కొద్ది రోజుల గ్యాప్‌తో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు టోర్నీల‌లో భార‌త జ‌ట్టు పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డనుంది. ఇక ఈ సారి వ‌ర‌ల్డ్ క‌ప్ ఇండియా వేదిక‌గా జ‌ర‌గ‌నుండ‌డంతో పోరు మంచి రంజుగా ఉండ‌డం ఖాయ‌ంగా క‌నిపిస్తుంది. అయితే గ‌త సంవత్సర కాలంగా భారత జట్టును గాయాలు వేధిస్తుండ‌గా, కీల‌క ఆట‌గాళ్లు కీల‌క మ్యాచ్‌ల‌కి అందుబాటులో లేకుండా పోయారు.

గాయాల కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఆసియా క‌ప్‌తో రీఎంట్రీ ఇస్తుండ‌గా, భార‌త జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఆసియా క‌ప్ కోసం టీమిండియా ప్ర‌క‌ట‌న త‌ర్వాత రోహిత్‌పై దారుణ‌మైన ట్రోలింగ్ న‌డుస్తుంది.

ఆసియా క‌ప్ టోర్నీ కోసం భార‌త జ‌ట్టులోకి టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ వ‌చ్చారు. వీరిద్ద‌రు కూడా ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకి చెందిన ఆట‌గాళ్లే. వీరిద్దరే కాకుండా ముంబై ఇండియన్స్‌కి ఆడిన వారిలో ఇషాన్ కిషన్, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు.

ఇక గుజరాత్‌కు చెందిన హార్దిక్ పాండ్యా.. గ‌తంలో ముంబై తరపున ఆడిన ఆటగాడే.. శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్ కూడా ముంబై తరపున ఆడిన వాళ్లే కాగా, రోహిత్ శ‌ర్మ కూడా ముంబైకి చెందిన ప్లేయ‌రే. ఇక చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ కూడా ముంబై మూలల నుంచి వచ్చిన వ్య‌క్తే. అందుకే భార‌త జ‌ట్టు కోసం ముంబైకి చెందిన ప్లేయ‌ర్స్‌ని ఎంపిక చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఒకప్పుడు అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్, అశ్విన్, చాహల్, శాంసన్ లాంటివారికి రోహిత్, అగార్క‌ర్, రాహుల్‌ అన్యాయం చేశార‌ని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రానున్న వన్డే ప్రపంచకప్‌లో జట్టు అవసరాలకు అనుగుణంగా తాను విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ కూడా చేస్తామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఆసియా క‌ప్‌కి చెందిన టీమిండియా స్క్వాడ్ చూస్తే..రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (స్టాండ్ బై) గా ఉన్నారు.