Baby | ‘RRR’ రేంజ్‌‌లో దూసుకెళుతూ.. బేబీకి కోట్ల వర్షం కురుస్తోందిక్కడ..

Baby | ఈమధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించిన సినిమా ఏదయ్యా అంటే అందరూ ‘బేబీ’ అనే చెబుతారు. ఇందులో వైష్ణవి చైతన్య నటనకు అంతా ఫిదా అవుతున్నారు. తను షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఒకే ఒక్క తెలుగు సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక హీరోలుగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఇద్దరూ నటించారు. అయితే సినిమా బంపర్ హిట్ కావడానికి యూత్ కంటెంట్ కావడం కూడా దీనికి […]

  • By: krs    latest    Jul 27, 2023 6:26 AM IST
Baby | ‘RRR’ రేంజ్‌‌లో దూసుకెళుతూ.. బేబీకి కోట్ల వర్షం కురుస్తోందిక్కడ..

Baby |

ఈమధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించిన సినిమా ఏదయ్యా అంటే అందరూ ‘బేబీ’ అనే చెబుతారు. ఇందులో వైష్ణవి చైతన్య నటనకు అంతా ఫిదా అవుతున్నారు. తను షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఒకే ఒక్క తెలుగు సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక హీరోలుగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఇద్దరూ నటించారు.

అయితే సినిమా బంపర్ హిట్ కావడానికి యూత్ కంటెంట్ కావడం కూడా దీనికి ప్రధాన కారణం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ అనేది ఏదో ఒక సందర్భంలో పుడుతుంది. దానిని అందుకోవచ్చు లేదా మరపురాని జ్ఞాపకంగా దాచుకోవచ్చు. లేదూ అంటే అదో చేదు జ్ఞాపకంగా మిగిలిపోనూ వచ్చు. ఈ కారణంతోనే ఆడియన్స్‌లోని ప్రేమికులందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.

‘బేబీ’ సినిమా విడుదలయ్యాక రెండు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ వసూళ్ళతో ప్రారంభమై, ఇప్పటి వరకూ ఎక్కడా తగ్గకుండా అదే రేంజ్‌లో దూసుకుపోతుంది. ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లో దాదాపు 70 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

ఒకవైపు జోరుగా వానలు పడుతున్నా.. విడుదలై వారం పైన పూర్తయినా.. కూడా ఇప్పటికీ రోజుకి కోటి పైనే వసూళ్లు రాబడుతూ ఒక రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ వారం వచ్చే ‘బ్రో’ టాక్ కనుక కాస్త డౌన్ అయితే మాత్రం మరో వారం ‘బేబీ’ కలెక్షన్లు కుమ్ముకోవడం ఖాయం.

మాములుగా అయితే.. సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే సినిమాలకు మాత్రమే ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి. అలాంటిది ‘బేబీ’ మూవీకి వీకెండ్ తర్వాత కూడా ప్రతి రోజూ కోట్లలో కలెక్షన్లు వస్తుండటం ఈ సినిమా విజయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

సంక్రాంతి సినిమాగా కాకుండా బరిలోకి దిగిన ‘RRR’ సినిమాకి తప్పితే ఇప్పటి వరకూ అలాంటి వసూళ్ళు జరగలేదు. ఇప్పుడలాంటి గుర్తింపు ‘బేబీ’ మూవీకి దక్కింది. ఎక్కడా తగ్గకుండా ముందుకు పోతోన్న ఈ సినిమా గురించి ఆనందంగా చెప్పుకుంటున్నారు డిస్టిబ్యూటర్స్.

చిన్న సినిమా అనే ముద్ర చెరిపేసి ట్రెండ్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమాపై బయ్యర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి వరకూ 70 కోట్ల (గ్రాస్) కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరనుందని ట్రెడ్ పండితులు సైతం అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా అందరి హృదయాలను టచ్ చేస్తూ దూసుకుపోతున్న ఈ ‘బేబీ’ ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూద్దాం..