విధాత: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ (Sachin Tendulkar) ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన గొంతు, ఫొటోలు, పేరును అనుమతి లేకుండా ప్రకటనలకు ఉపయోగించుకుంటున్నారని అందులో పేర్కొన్నాడు.
మెడికల్ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్లోనూ తన ఫొటో కనపడుతోందన్నాడు. ఇది ప్రమాదకరం కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
ఈ మేరకు సచిన్‌హెల్త్.ఇన్ అనే వెబ్‌సైట్ తన ఫొటోను పెట్టుకుని ఔషధాలు అమ్ముతోందని తెలిపాడు. ఆ వెబ్‌సైట్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. దీనిపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.