Samantha | ఏంటి.. స‌మంత ఇలా మారిపోయింది.. అవాక్క‌వుతున్న అభిమానులు

Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డి మ‌రింత స్ట్రాంగ్ అయ్యేందుకు ఏడాది పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఖుషీ అనే చిత్రంతో పాటు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది స‌మంత‌. షూటింగ్ పూర్తైన త‌ర్వాత ఈ భామ విహార యాత్ర‌కి వెళ్లింది. ఇండోనేషియాలో త‌న ఫ్రెండ్‌తో క‌లిసి స‌మంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక మ‌రి కొద్ది […]

  • Publish Date - August 12, 2023 / 02:49 AM IST

Samantha |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డి మ‌రింత స్ట్రాంగ్ అయ్యేందుకు ఏడాది పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఖుషీ అనే చిత్రంతో పాటు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది స‌మంత‌. షూటింగ్ పూర్తైన త‌ర్వాత ఈ భామ విహార యాత్ర‌కి వెళ్లింది. ఇండోనేషియాలో త‌న ఫ్రెండ్‌తో క‌లిసి స‌మంత చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఇక మ‌రి కొద్ది రోజుల‌లో మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్ల‌నుంది. అయితే ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉంటున్న స‌మంత‌ ఆధ్యాత్మిక సేవలో, మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాల‌కి వెళుతుంది. గ్రీన‌రీలో ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తుంది. చిన్న పిల్ల‌లతో స‌ర‌దాగా ఆడుకుంటుంది. ఇక త‌న‌పెట్స్ తో టైమ్‌ స్పెండ్‌ చేస్తూ ఫుల్ చిల్ అవుతుంది.

మ‌రోవైపు యోగాసనాలు చేస్తూ, జిమ్‌లో శ్రమిస్తూ తన ఫిట్‌నెస్‌ని మ‌రింత పెంచుకుంటుంది స‌మంత‌. తాజాగా ఈ అమ్మ‌డు త‌న సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒక‌టి షేర్ చేసింది. ఇందులో త‌న నెయిల్ పెయింటింగ్స్‌తో పాటు జిమ్‌లో క‌ష్ట‌ప‌డుతున్న పిక్స్ షేర్ చేసింది.

వాటితో పాటు పెట్స్, పుస్తకాలు, పూల బొకే వంటివి కూడా షేర్ చేసింది. స‌మంత షేర్ చేసిన పిక్‌లో ఆమె క‌ళ్ల‌జోడు పెట్టుకొని కాస్త డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించింది. మేక‌ప్ లేకుండా స‌మంత చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపించ‌డంతో ఆమె ఫేస్ లో చాలా మార్పు క‌నిపించింద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

స‌మంత అభిమానులు అయితే ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు. ఇక నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత.. పెళ్లైన‌ నాలుగేళ్లకు విడాకులు తీసుకొని అందరికి షాక్ ఇచ్చింది. వీరిద్ద‌రి విడాకుల‌కి అస‌లు కారణాలేంటి అనేది ఇప్ప‌టికీ బయటకు రాకపోయినా ఆమె విడాకుల గురించి ఏదో ఒక ప్ర‌చారం అయితే న‌డుస్తుంది. విడాకుల త‌ర్వాత స‌మంత చేసిన య‌శోద ఒక్క‌టి మంచి స‌క్సెస్ సాధించ‌గా, శాకుంత‌లం మాత్రం నిరాశ‌ప‌ర‌చింది.ఇప్పుడు ఖుషీ చిత్రంపైనే బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకుంది.