Sapthami gowda | వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా కాంతార బ్యూటీ.. ఆ అందాలకి చిత్తైపోవాల్సిందే!
Sapthami gowda | చిన్న సినిమాగా వచ్చిన పెద్ద విజయం సాధించిన చిత్రాలలో కాంతార అనే కన్నడ చిత్రం ఒకటి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇందులో కథానాయికగా నటించిన అందాల ముద్దుగుమ్మ సప్తమి గౌడ్. ఇందులో తన అందం, అభినయంతో కట్టిపడేసింది సప్తమి. 2020లో వచ్చిన పాప్‌కార్న్ మంకీ టైగర్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామ తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకొని విమర్శకుల […]

చిన్న సినిమాగా వచ్చిన పెద్ద విజయం సాధించిన చిత్రాలలో కాంతార అనే కన్నడ చిత్రం ఒకటి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇందులో కథానాయికగా నటించిన అందాల ముద్దుగుమ్మ సప్తమి గౌడ్. ఇందులో తన అందం, అభినయంతో కట్టిపడేసింది సప్తమి.
2020లో వచ్చిన పాప్‌కార్న్ మంకీ టైగర్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామ తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే కాంతార చిత్రం సప్తమి క్రేజ్ మరింత పెంచేలా చేసింది.
కాంతార ఇచ్చిన సక్సెస్ తో సప్తమి గౌడకి అవాకశాలు భారీగానే వస్తున్నాయి. బాలీవుడ్‌కి కూడా ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం హిందీలో వ్యాక్సిన్ వార్ అనే ఓ క్రేజీ మూవీలో నటిస్తుండగా త్వరలో టాలీవుడ్ లోకి కూడా ఈ అమ్మడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు అనే సినిమాలో హీరోయిన్ గా సప్తమిని మేకర్స్ ఫైనల్ చేసినట్టు టాక్. ఇటీవల లుక్ టెస్ట్ జరిగిందని, ఆ తర్వాత సప్తమిని ఫైనలైజ్ చేసినట్టు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతుంది.
సప్తమితో పాటు అలనాటి అందాల భామ లయ కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్టు తెలు స్తుంది. సప్తమి, లయ పాత్రలు చిత్రంలో చాలా కీలకంగా ఉంటాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ టైటిల్‌తో నితిన్ చేస్తున్న ప్రయోగంలో సప్తమి కూడా భాగం కావడం, మరి ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుందనేది చూడాలి.
ఇక సప్తమి గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తనకి సంబంధించిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది.
తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ వైట్ కలర్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాలతో చాలా క్యూట్ క్యూట్‌గా కనిపిస్తుంది. కన్నడ భామని ఇలా చూసి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. సప్తమి గౌడకి మంచి ఫ్యూచర్ ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram