Sarath Babu | విషమంగా నటుడు శరత్ బాబు ఆరోగ్యం

Sarath Babu విధాత: నటుడు శరత్ బాబు(Sarath Babu) ఆరోగ్యం అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. హైదరాబాదులోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన శరీరమంతా విషతుల్యం‌గా మారి కిడ్నీ, లివర్ పాడైనట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. మొన్నటి వరకూ బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబును మెరుగైన చికిత్స నిమిత్తం నిన్న హైదరాబాద్‌ ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షంచిన వైద్యులు శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, […]

  • By: krs    latest    Apr 23, 2023 5:25 AM IST
Sarath Babu | విషమంగా నటుడు శరత్ బాబు ఆరోగ్యం

Sarath Babu

విధాత: నటుడు శరత్ బాబు(Sarath Babu) ఆరోగ్యం అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. హైదరాబాదులోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన శరీరమంతా విషతుల్యం‌గా మారి కిడ్నీ, లివర్ పాడైనట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే.. మొన్నటి వరకూ బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబును మెరుగైన చికిత్స నిమిత్తం నిన్న హైదరాబాద్‌ ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు.

ఆయనను పరీక్షంచిన వైద్యులు శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈరోజు ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి మార్చినట్లు తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే ఆయన పరిస్థితి విషమంగా ున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.

శరత్ బాబు(Sarath Babu) అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి ఆయన అభిమానులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. శరత్‌బాబు తెలుగులో చివరగా పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌లో నటించారు.