Teacher | లింగ‌మార్పిడి చేయించుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. ఆమెతో పెళ్లి..

Teacher | ఓ ఉపాధ్యాయురాలు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిలా మారారు. ఇక ఇప్పుడు అత‌డిగా మారిన ఆమె పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధ‌మైంది. దివ్యాంగురాలైన త‌న‌కు ఎంతో కాలం నుంచి సేవ‌లందిస్తున్న యువ‌తిని జీవిత భాగ‌స్వామిగా చేసుకునేందుకు సిద్ధ‌ప‌డింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ షాజ‌హాన్‌పూర్‌లోని ఖుదాగంజ్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని న‌వాదా గ్రామానికి చెందిన స‌రితా సింగ్.. ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలిగా ప‌ని చేస్తోంది. అయితే దివ్యాంగురాలైన స‌రితా.. చిన్న‌ప్ప‌ట్నుంచి అబ్బాయిలా ఉండ‌డానికి ఇష్ట‌ప‌డేది. ఈ క్ర‌మంలో […]

Teacher | లింగ‌మార్పిడి చేయించుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. ఆమెతో పెళ్లి..

Teacher | ఓ ఉపాధ్యాయురాలు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిలా మారారు. ఇక ఇప్పుడు అత‌డిగా మారిన ఆమె పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధ‌మైంది. దివ్యాంగురాలైన త‌న‌కు ఎంతో కాలం నుంచి సేవ‌లందిస్తున్న యువ‌తిని జీవిత భాగ‌స్వామిగా చేసుకునేందుకు సిద్ధ‌ప‌డింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ షాజ‌హాన్‌పూర్‌లోని ఖుదాగంజ్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని న‌వాదా గ్రామానికి చెందిన స‌రితా సింగ్.. ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలిగా ప‌ని చేస్తోంది. అయితే దివ్యాంగురాలైన స‌రితా.. చిన్న‌ప్ప‌ట్నుంచి అబ్బాయిలా ఉండ‌డానికి ఇష్ట‌ప‌డేది. ఈ క్ర‌మంలో పురుషుల దుస్తులు ధ‌రించ‌డం, వారిలా హెయిర్ స్టైల్ చేసుకుంటుంది. దీంతో ఆమె పురుషుడిగా మారాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఇక స‌రితా సింగ్‌కు 2020లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వ‌చ్చింది. ఆ ఏడాదే లింగ‌మార్పిడి చేయించుకోవాల‌ని స‌రితా సింగ్ నిర్ణ‌యించుకుని.. ల‌క్నోలో హార్మోన్ మార్ప‌డి థెర‌పీ చేయించుకుంది. మొత్తానికి ఆ చికిత్స‌తో స‌రిత గొంతు మారింది.

ముఖంపై గ‌డ్డం రావ‌డంతో ఇత‌ర మార్పులు క‌నిపించాయి. తాజాగా 3 నెల‌ల కింద‌ట మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో లింగ‌మార్పిడి చేయించుకుని స‌రితా సింగ్ శ‌ర‌త్ సింగ్‌గా మారారు. షాజ‌హాన్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఉమేశ్ ప్రతాప్ సింగ్ నుంచి లింగ‌మార్పిడి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకుంది.

దివ్యాంగురాలైన స‌రిత అవ‌స‌రాల‌న్నీ స‌వితా సింగ్ అనే యువ‌తి చూసుకునేది. చ‌దువులో కూడా అండ‌గా ఉండేది. ఈ నేప‌థ్యంలో స‌విత‌ను జీవిత భాగ‌స్వామిగా చేసుకోవాల‌ని శ‌ర‌త్ సింగ్ నిర్ణ‌యించుకున్నారు. ఆమె కూడా శ‌ర‌త్ ప్ర‌తిపాద‌న‌కు అంగీకరించ‌డం గ‌మ‌నార్హం.