Kothagudem | విద్యార్థులతో సెల్ఫీ దిగి డుమ్మా కొట్టిన టీచర్.. సస్పెండ్ చేసిన డీఈవో
Kothagudem | ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ టీచర్ అతి తెలివి.. తన విధులకే ఎసరు పెట్టింది. స్కూల్ ప్రారంభమైన వెంటనే పిల్లలతో కలిసి మొక్కలు నాటినట్లు సెల్ఫీ దిగాడు ఆ టీచర్. ఆ ఫొటోలు హెడ్‌మాస్టర్‌కు పంపి తాను స్కూల్‌కు హాజరైనట్లు చెప్పాడు. కానీ ఫొటోలు పంపిన కొద్ది నిమిషాలకే టీచర్ బడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆ టీచర్‌ను డీఈవో సస్పెండ్ చేశారు.

Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ టీచర్ అతి తెలివి.. తన విధులకే ఎసరు పెట్టింది. స్కూల్ ప్రారంభమైన వెంటనే పిల్లలతో కలిసి మొక్కలు నాటినట్లు సెల్ఫీ దిగాడు ఆ టీచర్. ఆ ఫొటోలు హెడ్‌మాస్టర్‌కు పంపి తాను స్కూల్‌కు హాజరైనట్లు చెప్పాడు. కానీ ఫొటోలు పంపిన కొద్ది నిమిషాలకే టీచర్ బడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆ టీచర్‌ను డీఈవో సస్పెండ్ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెంలోని నెహ్రూ బస్తీలో ప్రభుత్వ పాఠశాల ఉంది. అక్కడ టీచర్‌గా విధులు నిర్వరిస్తున్న భాస్కర్ అనే వ్యక్తి.. శనివారం ఉదయం పాఠశాలకు హాజరయ్యాడు. విద్యార్థులతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాడు భాస్కర్. ఈ సందర్భంగా మొక్కలు నాటుతూ, విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగాడు. ఇక ఆ ఫొటోలను స్కూల్ హెడ్‌మాస్టర్‌కు టీచర్ పంపి, తాను విధులకు హాజరైనట్లు తెలిపాడు. కానీ కొద్దిసేపటికే ఎలాంటి అనుమతి లేకుండా టీచర్ స్కూల్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం సమయానికి కూడా భాస్కర్ తిరిగి రాలేదు. టీచర్ లేడని చెప్పి మరో 9 మంది విద్యార్థులు కూడా స్కూల్ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హెడ్‌మాస్టర్.. జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చారు. తక్షణమే స్పందించిన డీఈవో వెంకటేశ్వర చారి.. భాస్కర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.