Water Metro | కొచ్చి వాట‌ర్ మెట్రో వ‌ద్ద ల‌క్ష‌ల సంఖ్య‌లో చేప‌లు.. ప‌ట్టుకునేందుకు ఎగ‌బ‌డ్డ జ‌నం

Viral Video | Water Metro | కొచ్చి వాట‌ర్ మెట్రో ట‌ర్మిన‌ల్ వ‌ద్ద చేప పిల్ల‌లు క‌నువిందు చేశాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో చేప‌లు నీటిలో ఎగురుతూ స్థానికుల‌ను ఆక‌ర్షించాయి. ఆ చేప పిల్ల‌ల‌ను ప‌ట్టుకునేందుకు జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. కొంద‌రైతే ఆ దృశ్యాల‌ను త‌మ ఫోన్ల‌లో బంధించారు. ప్ర‌స్తుతం ఆ చేప పిల్ల‌ల వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఆ చేప పిల్ల‌లు ఒకేసారి అలా ఎందుకు ఎగిరాయ‌నే విష‌యం తెలియ‌రాలేదు. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ […]

Water Metro | కొచ్చి వాట‌ర్ మెట్రో వ‌ద్ద ల‌క్ష‌ల సంఖ్య‌లో చేప‌లు.. ప‌ట్టుకునేందుకు ఎగ‌బ‌డ్డ జ‌నం

Viral Video |

Water Metro | కొచ్చి వాట‌ర్ మెట్రో ట‌ర్మిన‌ల్ వ‌ద్ద చేప పిల్ల‌లు క‌నువిందు చేశాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో చేప‌లు నీటిలో ఎగురుతూ స్థానికుల‌ను ఆక‌ర్షించాయి. ఆ చేప పిల్ల‌ల‌ను ప‌ట్టుకునేందుకు జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. కొంద‌రైతే ఆ దృశ్యాల‌ను త‌మ ఫోన్ల‌లో బంధించారు. ప్ర‌స్తుతం ఆ చేప పిల్ల‌ల వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ఆ చేప పిల్ల‌లు ఒకేసారి అలా ఎందుకు ఎగిరాయ‌నే విష‌యం తెలియ‌రాలేదు. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం.. నీటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో చేపలు బ‌య‌ట‌కు ఎగ‌ర‌డానికి గల కారణాన్ని ‘సార్డిన్ రన్’ అని పిలుస్తారు.

సార్డిన్ రన్ అనేది అధిక లవణీయతతో మెరుగైన పోషకాల కారణంగా ఒక రకమైన ఆల్గే బ్లూమ్ ద్వారా ప్రేరేపించబడిన ఒక వింతైన ప్రవర్తన. ఇది తీరం వెంబడి జరగడం సాధారణం అని యూనివ‌ర్సిటీ వెల్ల‌డించింది.