Talliki Vandanam”| 10నుంచి రెండో విడత ” తల్లికి వందనం ” నగదు విడుదల

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి తల్లికి వందనం పథకం రెండో విడత జమకు డేట్ ఖారారైంది. ఈ నెల 10వ తేదీ నుంచి రెండో విడత తల్లికి వందనం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని నిర్ణచింది. ఇందుకోసం ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. పథకం మొత్తంలో రూ. 15 వేలలో తల్లుల ఖాతాల్లో రూ. 13 వేలు జమ చేసి, మిగిలిన రూ. 2 వేలు పాఠశాలల మెయింటనెన్స్ గ్రాంట్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలోని అకౌంట్‌లో జమ చేశారు. తొలి విడతలో 2 నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే నిధులు విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
తదుపరి జాబితాలో ఈ విద్యా సంవత్సరం ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని కూడా వెల్లడించింది. ఈ నెల 10వ తేదీన స్కూల్స్ లో పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనుండగా… అదే రోజు తల్లికి వందనం నిధులు విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకూ ఒకటో తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్ ఫస్టియర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.