Zero Shadow | రేపు మీ నీడ మాయం.. హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12.22 గంటలకు జీరో షాడో

Zero Shadow ఏ ఏడాదిలో ఈ అద్భుతం రెండోసారి హైదరాబాద్‌: సాధారణంగా మన నీడ మన పక్కనే ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయించి.. పశ్చిమాన అస్తమించే వరకూ నీడ పడే ప్రదేశం మారుతూ ఉంటుంది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉన్నా కూడా నీడ కొంచెం అటూ ఇటూగా ఉంటుంది. కానీ.. అసలు నీడ పడని సందర్భం కూడా ఉంటుందా? ఉంటుంది. ఒకసారి కాదు.. ఏటా రెండు సార్లు మన నీడ మాయం అవుతుంది. అటువంటి అరుదైన ఖగోళ […]

  • Publish Date - August 2, 2023 / 11:19 AM IST

Zero Shadow

  • ఏ ఏడాదిలో ఈ అద్భుతం రెండోసారి

హైదరాబాద్‌: సాధారణంగా మన నీడ మన పక్కనే ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయించి.. పశ్చిమాన అస్తమించే వరకూ నీడ పడే ప్రదేశం మారుతూ ఉంటుంది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉన్నా కూడా నీడ కొంచెం అటూ ఇటూగా ఉంటుంది. కానీ.. అసలు నీడ పడని సందర్భం కూడా ఉంటుందా? ఉంటుంది.

ఒకసారి కాదు.. ఏటా రెండు సార్లు మన నీడ మాయం అవుతుంది. అటువంటి అరుదైన ఖగోళ అద్భుతం హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం సుమారు 12.22 గంటల సమయంలో కనిపించనున్నది. ఆ సమయంలో మీ నీడ మాయం అవబోతున్నది. జీరో షాడోగా చెప్పే ఈ అద్భుత దృశ్యం మొన్న మే 9న ఆవిష్కారమైన సంగతి తెలిసిందే.

భూమధ్య రేఖా ప్రాంతంలో ఏటా రెండు సందర్భాల్లో జీరో షాడో చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు సరిగ్గా పైన ఉంటాడు. మనుషులు లేదా వస్తువుల నీడ మాయమవుతుంది. దీనిని అనుభూతి చెందాలంటే బహిరంగ ప్రదేశంలో నిటారుగా నిలబడాలి. అంతే సరిగ్గా గమనిస్తే.. మీ నీడ కనిపించదు. దీనిని మీరు ప్రయోగాత్మకంగా కూడా పరిశీలించవచ్చు.

దానికి మీరు చేయాల్సిందల్లా.. ఒక తెల్లటి పేపర్‌ ఎండ కింద పెట్టాలి. దానిపై ఒక పొడవాటి వస్తువు.. ఏదైనా గ్లాసు, పీవీసీ పైప్‌వంటి వాటిని నిటారుగా నిలబెట్టాలి. మధ్యాహ్నం 12.22 గంటలకు రెండు మూడు నిమిషాల ముందు, ఆ తర్వాత రెండు మూడు నిమిషాలు నీడ మారటాన్ని మార్క్‌ చేయండి. సుమారు 12.22 గంటలకు మాత్రం మీకు నీడ అనేది కనిపించదు. ఉత్సాహం ఉంటే.. మీ మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈ మొత్తం ప్రక్రియను రికార్డు చేసుకుని.. నలుగురితోనూ పంచుకోండి!