సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా వి.శేషాద్రి, తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డిలను నియమిస్తు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

- ఇంటలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి
విధాత : సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా వి.శేషాద్రి, తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డిలను నియమిస్తు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎంగా రేవంత్ రెడ్డి పదవి ప్రమాణా స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు అభయ హస్తం చట్టంపైన, మరుగుజ్జు దివ్యాంగురాలైన రజినికి ఉద్యోగం కల్పిస్తూ సంతకాలు చేశారు. అదే సమాయానికి ప్రగతి భవన్ బారికేడ్లు, కంచెలను తొలగింపు చేపట్టారు.
ప్రగతి భవన్‌ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా నామకరణ చేస్తూ శనివారం తొలి ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నట్లుగా రేవంత్ ప్రకటించారు. ఆ వెంటనే ప్రభుత్వం నుంచి సీఎం ప్రిన్సిపల్ రేవంత్ రెడ్డి సెక్రటరీగా శేషాద్రిని, ఇంటలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి నియామితులవ్వడంతో రేవంత్ మార్క్ పరిపాలన మార్పులు ఆరంభమైనట్లయ్యింది. ఇదే క్రమంలో మరింత మంది ఐఏఎస్, ఐపీఎస్‌ల స్థానాల్లోనూ మార్పులు చేర్పులు ఉండబోతుండటం ఆసక్తి రేపుతుంది.