Shraddha Walker murder case | శ్రద్ధా వాకర్ హత్య కేసు.. నిందితునిపై ఆరోపణలను ధ్రువీకరించిన కోర్టు
Shraddha Walker murder case విధాత: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై ఉన్న ఆరోపణలను దిల్లీలోని సాకేత్ కోర్టు ధ్రువీకరించింది. నిందితుడు హత్య, అపహరణ, సాక్ష్యాధారాల నాశనం చేశాడనడానికి బలమైన ఆధారాలున్నాయని జడ్జి స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలను నిందితుడు ఒప్పుకోకుండా విచారణకు డిమాండు చేయడంతో తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తనతో కలిసి సహజీవనం చేస్తున్న […]

Shraddha Walker murder case
విధాత: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై ఉన్న ఆరోపణలను దిల్లీలోని సాకేత్ కోర్టు ధ్రువీకరించింది.
నిందితుడు హత్య, అపహరణ, సాక్ష్యాధారాల నాశనం చేశాడనడానికి బలమైన ఆధారాలున్నాయని జడ్జి స్పష్టం చేశారు.
అయితే ఈ ఆరోపణలను నిందితుడు ఒప్పుకోకుండా విచారణకు డిమాండు చేయడంతో తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తనతో కలిసి సహజీవనం చేస్తున్న శ్రద్ధాను అఫ్తాబ్ ముక్కలుముక్కలుగా నరికి పలు చోట్ల విసిరేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన గతేడాది మే 18న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.