రామమందిర్ ఆహ్వాన పత్రికలు రెడీ
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవ ఆహ్వాన ప్రతికలు రెడీ అయ్యాయి.

- జనవరి 22న గుడిలో ప్రాణప్రతిష్ఠ
- 6,000 మంది ప్రముఖుల ఆహ్వానాలు
విధాత: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవ ఆహ్వాన ప్రతికలు రెడీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన లేఖల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనవరి 22వ తేదీన గర్భగుడిలో సీతారాముల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. అదే రోజు రామమందిరాన్ని ప్రారంభించనున్నట్టు ఇప్పటికే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.
రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించే సాధువులు, వీవీఐపీలతో సహా సుమారు 6000 మంది ప్రముఖుల జాబితాను ట్రస్ట్ ఖరారు చేసింది. వారికి ఆహ్వాన పత్రికలు పంపించే ప్రక్రియను ట్రస్ట్ ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరుకానున్నారు. ఆహ్వానాలు పోస్ట్ ద్వారా పంపబడుతున్నాయి. వివిధ ఆన్‌లైన్ మాధ్యమాల్లో, స్వయంగా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామమందిరం నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.