రైతు నాలుకపై కాటేసిన పాము.. ఆ..నాలుకను కోసేసిన పూజారి!
snake bite | ఓ రైతుకు కలలోకి పాము వచ్చేది. అది కాటేస్తున్నట్లు కలలు రావడంతో రైతు భయపడి పోయేవాడు. ఏదో ఒక రోజు కాదు.. అలా ప్రతి రోజు పాము కలలోకి వచ్చేది. దీంతో రైతు పూజారిని సంప్రదించాడు. సర్పాలయం వెళ్లి పూజలు చేయించుకోవాలని రైతుకు పూజారి సూచించాడు. అక్కడ పూజలు చేసిన అనంతరం ఆ రైతు నాలుకపై పాము కాటేసింది. పూజారి భయ పడి ఆ రైతు నాలుకను కోసేశాడు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో […]

snake bite | ఓ రైతుకు కలలోకి పాము వచ్చేది. అది కాటేస్తున్నట్లు కలలు రావడంతో రైతు భయపడి పోయేవాడు. ఏదో ఒక రోజు కాదు.. అలా ప్రతి రోజు పాము కలలోకి వచ్చేది. దీంతో రైతు పూజారిని సంప్రదించాడు. సర్పాలయం వెళ్లి పూజలు చేయించుకోవాలని రైతుకు పూజారి సూచించాడు. అక్కడ పూజలు చేసిన అనంతరం ఆ రైతు నాలుకపై పాము కాటేసింది. పూజారి భయ పడి ఆ రైతు నాలుకను కోసేశాడు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కొపిచెట్టిపాలయం గ్రామానికి చెందిర రాజా(54) వృత్తిరీత్యా రైతు. అయితే అతనికి ప్రతి రోజు కలలో పాము వచ్చేది. పాము తనను కాటేస్తున్నట్లు భావించి, నిద్రలోనే ఉలిక్కి పడేవాడు. ప్రతి రోజు అలానే జరుగుతుండటంతో.. రాజా ఓ పూజారిని సంప్రదించాడు. సర్పాలయంలో కొన్ని పూజలు చేస్తే, కలలు రావడం ఆగిపోతాయని సూచించాడు.
దీంతో పూజారి చెప్పినట్టు రాజా సర్పాలయం వెళ్లాడు. అక్కడ పూజలు నిర్వహించాడు. ఇక పాము ముందు నాలుకను పెట్టాడు. పాము ఒకట్రెండు సార్లు ఏమనలేదు. మూడోసారి అతని నాలుకపై కాటేసింది. దీంతో విలవిలలాడి పోతున్న రైతు నాలుకను అక్కడే ఉన్న పూజారి కత్తితో కోసేశాడు.
అనంతరం రైతును ఈరోడ్ మనియన్ మెడికల్ సెంటర్‌కు పూజారి తరలించాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో రైతు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తెగిపోయిన నాలుకకు వైద్యులు కుట్లు వేశారు. త్వరలోనే రైతు రాజా కోలుకుంటాడని డాక్టర్లు పేర్కొన్నారు. యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు.