Sonia Gandhi is sick l విధాత: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) గురువారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ (Sir Ganga Ram Hospital)కు తరలించారు. ఆమె జ్వరంతో బాధ పడుతున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు.
ఛాతీ వైద్య విభాగం (Department of Chest Medicine) సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరుప్ బసు (Arup Basu) టీమ్ పర్యవేక్షణలో సోనియాకు వైద్య సేవలు అందిస్తున్నట్టు గంగారాం హాస్పిటల్ ట్రస్ట్ సొసైటీ చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని, పలు టెస్టులు చేశామని, ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.