ఆరేండ్ల త‌ర్వాత‌.. సోనియాతో బీహార్ సీఎం నితీశ్ భేటీ

విధాత : కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియా గాంధీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ భేటీ కానున్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కూడా పాల్గొననున్నారు. సోనియాతో నితీశ్ భేటీ కావ‌డం ఆరేండ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీకి రాజ‌కీయ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గ‌త మంగ‌ళ‌వారం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం సోనియాను నితీశ్ క‌లుస్తార‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. దేశ ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా […]

  • Publish Date - September 25, 2022 / 02:53 AM IST

విధాత : కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియా గాంధీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ భేటీ కానున్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కూడా పాల్గొననున్నారు. సోనియాతో నితీశ్ భేటీ కావ‌డం ఆరేండ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీకి రాజ‌కీయ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

గ‌త మంగ‌ళ‌వారం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం సోనియాను నితీశ్ క‌లుస్తార‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. దేశ ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని లాలూ చెప్పారు. 2024 ఎన్నిక‌ల్లో బీజేపీని కూక‌టివేళ్ల‌తో పెకిలించాల‌ని దేశ ప్ర‌జ‌ల‌ను ఆయ‌న కోరారు. బీజేపీని ఓడించేందుకు కావాల్సిన అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకుంటామ‌న్నారు. భార‌త్ జోడో యాత్ర పూర్త‌యిన త‌ర్వాత రాహుల్ గాంధీని కూడా కలుస్తాన‌ని ఆర్జేడీ చీఫ్ పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. బీజేపీని గ‌ద్దెదించాల‌ని, అందుకు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఇరువురు నేత‌లు అన్నారు. బీహార్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం కేసీఆర్ నితీశ్ కుమార్‌తో పాటు ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్‌ల‌ను క‌లిశారు. ఇక 2024 ఎన్నిక‌ల్లో నితీశ్ కుమార్‌ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పేర్కొంటూ పాట్నాలో ఇటీవ‌ల పోస్ట‌ర్లు వెలిశాయి.