EC | ప్రత్యేక ఓటరు నమోదు.. ప్రచారానికి విశేష స్పందన: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
EC | విధాత, హైదరాబాద్: ఓటు ప్రాధాన్యతపై ఓటర్లకు అవగాహన పెంపొందించి, ఎన్నికల్లో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన లభించడం ఆనందించదగ్గ విషయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు ప్రచారంలో భాగంగా మొదటి రోజు పౌరుల నుంచి వచ్చిన స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు నమోదు […]
EC |
విధాత, హైదరాబాద్: ఓటు ప్రాధాన్యతపై ఓటర్లకు అవగాహన పెంపొందించి, ఎన్నికల్లో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన లభించడం ఆనందించదగ్గ విషయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు ప్రచారంలో భాగంగా మొదటి రోజు పౌరుల నుంచి వచ్చిన స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమానికి లభిస్తున్న స్పందనపై 33 జిల్లాల ఎన్నికల అధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి సమగ్రంగా సమీక్షించారు. ఓటర్ల భాగస్వామ్యం, కొత్త ఓట్ల నమోదును పెంపొందించడంలో సాధించిన గణనీయమైన పురోగతి సాధించాలని ఆయన సూచించారు. జనాభాలోని నిర్దిష్ట విభాగాలపై ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.
18-19 సంవత్సరాల వయస్సు ఉన్న యువతీయువకులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. తొలిసారి ఓటు నమోదు చేసుకునేలా మహిళా ఓటర్లను ప్రోత్సహించాలన్నారు. వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, థర్డ్ జెండర్ ఓటర్లకు ప్రతి అవకాశాన్ని కల్పించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ఓటర్లందరికీ ఖచ్చితత్వం, యాక్సెసిబిలిటీని నిర్ధారించే లక్ష్యంతో పోలింగ్ స్టేషన్ల పేర్లు, చిరునామాలలో సవరణలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల ముద్రణకు సంబంధించి 2023 ఆగస్టు 15 వరకు ఆమోదించిన దరఖాస్తుల కోసం ఈపీఐసీలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందుకు సంబంధించిన వర్క్ ఆర్డర్‌లను వెంటనే జారీ చేయాలన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram