Sri Lanka | భారత కరెన్సీనే మేమూ వాడతాం: విక్రమసింఘే
Sri Lanka ఉమ్మడి వినియోగానికి ఇబ్బంది లేదు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే వెల్లడి కొలంబో: అమెరికా డాలర్‌ను శ్రీలంకలో ఎలా వాడుతామో.. భారత కరెన్సీని కూడా వాడేందుకు ఇబ్బంది ఏమీ లేదని శ్రీలంక ప్రకటించింది. త్వరలో న్యూఢిల్లీలో పర్యటించనున్న కొద్ది రోజుల ముందు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే ఈ విషయం వెల్లడించారు. శ్రీలంక ప్రస్తుతం తీవ్ర నగదు కొరత ఎదుర్కొంటున్నది. భారతీయ సీఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో విక్రమసింఘే ఈ మేరకు ప్రకటన చేశారు. దేశానికి ఆయన […]

Sri Lanka
- ఉమ్మడి వినియోగానికి ఇబ్బంది లేదు
- శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే వెల్లడి
కొలంబో: అమెరికా డాలర్‌ను శ్రీలంకలో ఎలా వాడుతామో.. భారత కరెన్సీని కూడా వాడేందుకు ఇబ్బంది ఏమీ లేదని శ్రీలంక ప్రకటించింది. త్వరలో న్యూఢిల్లీలో పర్యటించనున్న కొద్ది రోజుల ముందు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే ఈ విషయం వెల్లడించారు. శ్రీలంక ప్రస్తుతం తీవ్ర నగదు కొరత ఎదుర్కొంటున్నది. భారతీయ సీఈవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో విక్రమసింఘే ఈ మేరకు ప్రకటన చేశారు.
దేశానికి ఆయన ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో భారత రూపాయిని విస్తృతంగా వినియోగించడంపై ఫోరం చైర్‌పర్సన్ టీఎస్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు విక్రమసింఘే పైవిధంగా స్పందించారు.
జపాన్, కొరియా, చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు గత 75 సంవత్సరాలుగా గణనీయమైన ప్రగతి సాధించాయన్న విక్రమసింఘే.. ఇప్పుడు హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారత్ వంతు వచ్చిందని అన్నారు.
ఏడాది క్రితం తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకకు అధ్యక్షుడు అయిన తర్వాత విక్రమసింఘే భారత పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. భారత రూపాయిని ఉమ్మడి కరెన్సీగా వాడటంలో ఇబ్బంది ఏమీ ఉండదని ఆయన చెప్పారు.