Sri Reddy | పవన్ కళ్యాణ్ దేవుడు కాదు, కామాంధుడు..ఆడవారి జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడు: శ్రీరెడ్డి
Sri Reddy: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాలలోకి వచ్చాడో అప్పటి నుండి ఆయనపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందిన వారు పవన్‌పై నిత్యం ఏదో ఒకరకమైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక పవన్‌ని విమర్శించే వారిలో శ్రీరెడ్డి ముందుంటుంది. ఆమె గతంలో పవన్ కల్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం విడుదల కాగా, ఈ […]

Sri Reddy:
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాలలోకి వచ్చాడో అప్పటి నుండి ఆయనపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందిన వారు పవన్‌పై నిత్యం ఏదో ఒకరకమైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక పవన్‌ని విమర్శించే వారిలో శ్రీరెడ్డి ముందుంటుంది. ఆమె గతంలో పవన్ కల్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం విడుదల కాగా, ఈ మూవీతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించింది శ్రీరెడ్డి. చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించిన నేపథ్యంలో శ్రీరెడ్డి మాట్లాడుతూ..అరేయ్.. పిచ్చి సన్నాసుల్లారా పవన్ కల్యాణ్ దేవుడు కాదురా కామాంధుడు అంటూ విమర్శలు గుప్పించింది.
పవన్ ఎంతో మంది ఆడవారి జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడు. అలాంటి వాడికి మీరు ఎందుకు అంత ఇష్టపడుతున్నారు. మీరు చేస్తుంది ఎలా ఉంది అంటే .. పాపాలు చేసిన వాడే పుణ్యం ప్రసాదించినట్టు ఉంది. బ్రో సినిమాలో ఆయన దేవుడి గెటప్ లో ఉండి బీడీ కాల్చి ఐటెం భామలతో సరసాలు ఆడుతాడా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లు నెట్టింట సంచలనం రేపుతుండగా, ఆమె కామెంట్స్ పై పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
ఇక బ్రో విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో ఈ మూవీ రూపొందింది. సముద్రఖని దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తుంది. తమిళ రీమేక్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా త్రివిక్రమ్ రూపొందించారు. ముఖ్యంగా ఎమోషన్స్ హైలైట్ అయ్యేలా ఈ చిత్రం ఉందని ఆడియన్స్ చెబుతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ ధరతో డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ఐదు వారాల తర్వాత బ్రో చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో ఆ రోజు బ్రో చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. మరణించిన వ్యక్తికి కాల దేవుడు ప్రత్యక్షమై మరో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.