Urvashi Rautela

విధాత‌: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ ‘బ్రో’. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. అయితే ఇందులో ఓ సాంగ్‌లో కనిపించి, తన అందాలతో ముంచెత్తిన ఊర్వశి రౌతేలా ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అవి వైరల్ అవుతుండగానే మళ్ళీ కొత్తగా మరోసారి పవర్ స్టార్‌పై తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకుంది.

పవన్ కళ్యాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టమని చెప్పిన ఊర్వశి.. ఓ చిట్ చాట్‌లో ఆయన మీద ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించింది. తనను నెటిజన్లు చాలా ప్రశ్నలు వేయగా.. అందులోంచి ఒక ప్రశ్నకు మాత్రం టక్కున తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. ఇది యాదృశ్చికంగా జరిగిందో లేక నిజంగానే చెప్పిందో కానీ మీకు ఏపీ సీఎం వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరిలో ఎవరంటే ఇష్టం? అనే ప్రశ్న ఓ నెటిజన్ అడగగానే.. టక్కున పవన్ కళ్యాణ్ అనే సమాధానం ఇచ్చింది.

ఈ చిట్ చాట్‌కు ముందు కూడా ‘బ్రో’ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. సీఎం పవన్ కళ్యాణ్ అని సంభోధించడం కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే ఊర్వశి.. పవన్ మీద చూపుతున్న అభిమానానికి పవన్ అభిమానులు, ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇదంతా తనకు పబ్లిసిటీ వచ్చేందుకే అని, పవన్ పేరు వాడితే పబ్లిసిటీ ఆటోమేటిగ్గా వచ్చేస్తుందని ఎవరో చెప్పడం వల్లే.. ఊర్వశి ఇలా చేసిందనే వాదన కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఊర్వశిని మెప్పించిన పవన్ అనే టాక్ కూడా నడుస్తుంది. మరి ఏపీలో మంత్రులు పవన్‌ని తిడితే పదవులు వచ్చినట్లుగా.. ఊర్వకి పొగడ్తలకి ఎన్ని అవకాశాలు వస్తాయో చూడాలి.