SRSP | నిండు కుండ‌లా శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు.. 16 గేట్లు ఎత్తివేత‌

SRSP | ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాను వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న‌టి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షానికి ఉమ్మ‌డి జిల్లాలోని ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. ఇక వాగులు, వంక‌లు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్టుకు కూడా వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. ప్రస్తుతం ఎస్సార్ఎస్పీలోకి 75,100 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 64,038 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 90 టీఎంసీల నీటిని […]

  • By: raj |    latest |    Published on : Sep 05, 2023 12:04 AM IST
SRSP | నిండు కుండ‌లా శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు.. 16 గేట్లు ఎత్తివేత‌

SRSP |

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాను వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న‌టి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షానికి ఉమ్మ‌డి జిల్లాలోని ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. ఇక వాగులు, వంక‌లు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్టుకు కూడా వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది.

ప్రస్తుతం ఎస్సార్ఎస్పీలోకి 75,100 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 64,038 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 90 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు.

అయితే పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా మారింది. జిల్లాలో ఉన్న మరో జలాశయమైన రామడుగు ప్రాజెక్టులోకి 12,285 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో 1278.3 అడుగులకు నీటిమట్టం చేరింది.

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 29,800 క్యూసెక్కుల వరద వ‌చ్చి చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17 టీఎంసీల నీరు ఉన్నది.